Negative Calorie Food: బరువు తగ్గాలంటే నెగటివ్ కేలరీలు తీసుకోవాల్సిందే.. అలాంటి ఫుడ్స్, వాటి ఉపయోగాలు మీకోసం..!
Weight Loss Foods: తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనినే నెగటివ్ కేలరీలు ఉన్న పదార్థాలు అని అంటారు.

Negative Calorie Food: మనం బరువు తగ్గాలంటే చాలా విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. బరువు అదుపులో ఉంచుకుంటూ తగిన విధంగా డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. తినేటప్పుడు, తాగేటప్పుడు బరువు తగ్గడం గురించి ఆలోచించడానికి బాగుంటుంది. కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రం ఎంతమంది కంట్రోల్‌గా ఉంటారనే దానిపైనే వారి బరువు నియంత్రణలో ఉంటుంది. తింటూనే బరువు తగ్గించేందుకు మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం నిపుణులు చక్కని పరిష్కారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా నెగటివ్ క్యాలరీలతో బరువును అదుపుతో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దం..!
నెగటివ్ కేలరీలు అంటే ఏమిటి? తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనినే నెగటివ్ కేలరీలు ఉన్న పదార్థాలు అని అంటారు. ఇక స్పైసీ ఫాస్ట్ ఫుడ్స్ గురించి మాట్లాడితే, వాటిలో పోషకాలు లేవు. కేలరీలు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, ఇండెక్స్ ప్రకారం మనం తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. దాని వల్ల రెండు ప్రయోజనాలు కూడా ఉన్నాయంట. మొదటగా ఇలాంటి పదార్థాలు మన శరీరానికి పుష్కలంగా ఫైబర్‌ను అందిస్తాయి. ఇవి జీర్ణం కావడానికి కూడా చలా తక్కువ సమయం తీసుకుంటాయి. ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తాయి. రెండవది, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం శరీరంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీని కారణంగా మన శరీరంలో కొవ్వు పేరుకోదు.
నెగటివ్ కేలరీలు ఉండే ఆహారాలు..! యాపిల్స్, క్రాన్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, పార్స్లీ, పుచ్చకాయ, టమోటాలు, దోసకాయలు, క్యారెట్‌లలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే మనల్ని ఫిట్‌గా ఉండటానికి సహాయపడే పండ్లు. ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉన్నాయి. అయితే వీటి ప్రత్యేకత ఏటంటే, వీటిని జీర్ణం చేయడానికి ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఈ కారణంగా శరీరం నుంచి అదనపు కేలరీలు కరిగిపోతాయి. దాంతో మన శరీరంలో కొవ్వు పేరుకోదు. ఇలాంటి ఆహారాలను తింటూనే మనం ఎంచక్కా బరువు తగ్గవచ్చు.
Also Read: Pumpkin Benefits: బరువు తగ్గించే గుమ్మడి కాయ.. ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
Onions Benefits: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుంది..? పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!