AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర తక్కువ రుచి ఎక్కువ..! నాటు కోడిని మించిన టేస్ట్.. జుట్టు కోడి కూర ఇలా వండితే తెపాళ్ల లేపుతారు..

జుట్టు కోడి తెలంగాణలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక రకం నాటు కోడి.. ఇది నాటు కోడిలాంటి అద్భుతమైన రుచిని, తక్కువ ధరలో అందిస్తుంది. జుట్టు కోడి కూరను, ప్రత్యేకించి తెలంగాణ స్టైల్ మసాలాలతో వండితే అద్భుతమైన రుచి వస్తుంది.. ఆదివారం స్పెషల్ జుట్టు కోడి చికెన్ కర్రీ గ్రేవీ రెసిపీని ఈ కథనంలో తెలుసుకోండి..

ధర తక్కువ రుచి ఎక్కువ..! నాటు కోడిని మించిన టేస్ట్.. జుట్టు కోడి కూర ఇలా వండితే తెపాళ్ల లేపుతారు..
Chicken Curry
Shaik Madar Saheb
|

Updated on: Apr 26, 2026 | 10:40 AM

Share

మాంసాహార ప్రియులు.. ఆదివారం చికెన్ ను ఎంతో ఇష్టంగా వండుకుని తింటారు. అయితే.. చికెన్ లో నాటు కోడి మించిన రుచి జుట్టు కోడి వస్తుంది.. జుట్టు కోడి (Layer Chicken) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రసిద్ధి చెందిన ఒక రకం కోడి.. ఇది నాటు కోడిలాంటి అద్భుతమైన రుచిని, తక్కువ ధరలో అందిస్తుంది. జుట్టు కోడి కూరను, ప్రత్యేకించి తెలంగాణ స్టైల్ మసాలాలతో వండితే, నాటుకోడి పులుసును మించిన రుచి వస్తుందని.. ఇది ఇది దావత్‌లకు చాలా బాగుంటుందని పేర్కొంటుంటారు. సాధారణంగా బ్రాయిలర్ చికెన్ తో పోలిస్తే.. లేయర్ చికెన్ ధర తక్కువగా ఉంటుంది.. దీన్ని పల్లెటూరు ప్రాంతాల్లో బాగా వండుకుని తింటారు.. అయితే.. అలాంటి జుట్టు కోడిని ఎలా వండితే బాగుంటుంది.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

ఆదివారం స్పెషల్ జుట్టు కోడి చికెన్ కర్రీ గ్రేవీ రెసిపీ.. తెలుగు వంటకాలలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ నోరూరించే కూరను తయారుచేయడానికి మొదటగా, చికెన్ ముక్కలను ఉప్పు, పసుపు వేసి ప్రెషర్ కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది చికెన్ త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది.

తరువాత, ఒక పాత్రను స్టవ్‌పై పెట్టి నూనె వేడిచేయాలి. నూనె వేడయ్యాక, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను వేసి వేయించాలి. ఇది కూరకి అద్భుతమైన సువాసనను ఇస్తుంది. ఆ తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. కొద్దిగా పసుపు జోడించి, ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. కొంత సమయం మూతపెట్టి మగ్గనివ్వాలి, దీనివల్ల మసాలాలు చికెన్‌కు పడతాయి.

ఇప్పుడు, తగినంత కారం వేసి కలిపి, చికెన్ ఉడికించిన నీళ్లు, అసవరం అయితే.. రుచి కోసంరెండు టమాటాలు వేయాలి. కూరను బాగా కలిపి, చివరగా మిరియాల పొడి వేసి మరోసారి కలపాలి. కూర ఉడుకుతున్నప్పుడు, తరిగిన కొత్తిమీరను వేసి, మూతపెట్టి నూనె పైకి తేలే వరకు నెమ్మదిగా ఉడికించాలి. నూనె పైకి తేలితే కూర సరిగ్గా ఉడికినట్లు.. చివరగా కొంచెం గరం మసాలా వేసి.. దింపాలి.. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేస్తే ఆదివారం భోజనం మరింత రుచిగా మారుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..