AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

Weather alert AP Telangana: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తెలంగాణలోని 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో నిర్మల్‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పిడుగురాళ్లలో 47.6,  నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
Andhra Pradesh And Telangana Heatwave Alert
Rajashekher G
|

Updated on: May 20, 2026 | 9:58 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్‌లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి.

ఏపీలో ఎండలు మరింత తీవ్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వేసవి సీజన్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రత బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు నమోదైందని, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రానున్న నాలుగు రోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఇవాళ రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్ లో 15, గుంటూరులో 15, మార్కాపురం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా చూపిందని పేర్కొన్నారు. రాబోవు మూడు రోజులు క్రింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు

మే 21 గురువారం నాడు.. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

  • విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 – 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • మే 22 శుక్రవారం.. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • కాకినాడ, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకాళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • మే 23 శనివారం.. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 – 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 – 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • అలాగే రేపు 74 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 232 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 24 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

బుధవారం పల్నాడు(జి) పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, కృష్ణా(జి) కంకిపాడు, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 46.1డిగ్రీలు, పశ్చిమ గోదావరి(జి) తణుకులో 46 డిగ్రీలు, బాపట్ల(జి) కొల్లూరు, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడులో 45.9 డిగ్రీలు, ఏలూరు(జి) అల్లిపల్లిలో 45.7 డిగ్రీలు, ప్రకాశం(జి) కొండపి45.6 డిగ్రీలు, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 45.5 డిగ్రీలు, నెల్లూరు(జి) గూడూరులో 45.4 డిగ్రీలు, పోలవరం(జి) కూనవరంలో 45 డిగ్రీలు, గుంటూరు(జి) పాండ్రపాడులో 44.8, కోనసీమ(జి) రామచంద్రాపురంలో 44.5, అనకాపల్లి(జి) మాకవరపాలెం, తిరుపతి(జి) పూలతోటలో 44.4, విశాఖ(జి) ములగాడలో 43.6, కాకినాడ(జి) కాజులూరులో 43.5, నంద్యాల (జి) ఆళ్లగడ్డలో 43.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

అప్రమత్తంగా ఉండాలంటూ..

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు

ఇటు ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ కేంద్రం హైఅలెర్ట్ హెచ్చరిక

రానున్న రెండ్రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు చేరనున్న ఎండ తీవ్రత ఉంటుందని తెలిపింది. తీవ్ర వేడిగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు… బయటకు రాకుండా ప్రజలు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అప్రమత్తం చేశారు.

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్