బాదం, వాల్‌నట్స్.. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి తరచుగా తీసుకోవడం మంచిది.
పాలు, పాల పదార్థాలు.. కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండి పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. వీటిని ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకోవాలి.
గుడ్లు.. గుడ్లలో ఉండే కొలిన్ మెమోరీ, ఏకాగ్రతను పెంచుతుంది. ప్రతి రోజు ఒకటి లేదా రెండు గుడ్లను తినవచ్చు. దీంతో శరీరానికి అవసరమైన విటమిన్లతోపాటు శక్తి పెరుగుతుంది.
పచ్చి ఆకుకూరలు.. పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్ ఉండి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. అందుకే వీటిని ఆహారంలో తరచూ అందిస్తుండాలి.
చేపలు.. ముఖ్యంగా సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా-3 ఉండి బ్రెయిన్ సెల్స్ బలపడతాయి. చేప మాంసాన్ని తరచు తీసుకోవడం వల్ల మెమోరీ పెరుగుతుంది.
పండ్లు.. బ్లూబెర్రీ, అరటి, యాపిల్ వంటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్లతో మెమోరీ శక్తిని మెరుగుపరుస్తాయి. అందుకే వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
గింజలు, విత్తనాలు.. సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిని కూడా ప్రతిరోజు తక్కువ మోతాదులో తీసుకోవడం మెమోరీని పెంచుతుంది.
డార్క్ చాక్లెట్.. పరిమిత మోతాదులో ఈ డార్క్ చాక్లెట్లను తినడం ద్వారా మెదడుకు రక్తప్రసరణను పెంచి దృష్టి కేంద్రీకరణకు సహాయపడుతుంది.
ఓట్స్, ధాన్యాలు... శరీరానికి స్థిరమైన శక్తిని అందించి పిల్లలు ఎక్కువసేపు చదువుపై దృష్టి పెట్టేలా చేస్తాయి. వీటిని తరచూ పిల్లలకు అల్పాహారంగా పెట్టడం మంచింది.
నీరు, తాజా జ్యూసులు.. శరీరం హైడ్రేట్‌గా ఉంటే మెదడు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. నీటితోపాటు పండ్ల జ్యూస్‌లు ప్రతినిత్యం తగిన మోతాదులో పిల్లలకు అందించడం తప్పనసరి.