AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇదే..

రోజుకు రెండు అరటిపండ్లు తింటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపు మంట, అల్సర్లు, ఎసిడిటీ సమస్యలను తగ్గించడంలో అరటిపండు కీలకంగా పనిచేస్తుంది. అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు, షుగర్ పేషెంట్లు అరటిపండును మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇదే..
Banana Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2026 | 9:26 PM

Share

అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మనకు సంవత్సరం పొడవునా, అన్ని ప్రాంతాలలో లభించే అరటిపండును పిల్లలతో సహా అందరూ తినొచ్చు.. ఇతర పండ్ల మాదిరిగా వ్యర్థాలు లేకుండా, సులభంగా తినగలిగే, మంచి రుచినిచ్చే ఈ పండును అధిక కేలరీలు ఉంటాయనే కారణంతో ఇటీవల చాలామంది తినడం తగ్గించారు. పూర్వం రోజులలో ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు కాబట్టి, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు పెద్దగా ఉండేవి కావు. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో షుగర్ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు అరటిపండును మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇలాంటి వారు చిన్న సైజు అరటిపండును అప్పుడప్పుడు తీసుకున్నా హాని లేదని పేర్కొంటున్నారు.

అరటిపండు పోషకాలు.. ప్రయోజనాలు..

అరటిపండు తినడం వల్ల మనకు కలిగే ముఖ్యమైన లాభాలలో జీర్ణవ్యవస్థకు కలిగే మేలు ప్రధానమైనది. సాధారణంగా, వంద గ్రాముల అరటిపండులో నూట పదహారు కేలరీలు ఉంటాయి. అయితే, అరటిపండులో ఉండే ఒక ప్రత్యేక రసాయన సమ్మేళనం, ముఖ్యంగా బాగా పండిన అరటిపండులో లభించే ల్యూకోసైనడిన్ మన జీర్ణవ్యవస్థకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

నేటి జీవనశైలిలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌ల వంటి ఎసిడిక్ ఆహారాల వినియోగం పెరగడం వల్ల చాలామందిలో కడుపులో మంటలు, ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఈ సమస్యలకు చాలామంది నిత్యం మందులు వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ మందుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నా, అల్సర్లు రాకుండా పొట్టకు రక్షణ కల్పించాలన్నా ల్యూకోసైనడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పొట్ట అంచులలో కీలకమైన మ్యూకస్ స్రావాన్ని పెంచుతుంది.

మన పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCl) 0.8 pH నుండి 1.2 pH వరకు ఘాటైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది బట్టలపై పడినా, శరీరంపై పడినా కాలేంత శక్తివంతమైనది. మరి ఇంతటి ఘాటైన యాసిడ్ నుండి పొట్ట ఎలా రక్షింపబడుతుందంటే, యాసిడ్ ఘాటుకు విరుగుడుగా పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది. కాఫీ, టీలు, ఒత్తిడి, మందుల వాడకం, నీరు తక్కువగా తాగడం వంటి కారణాల వల్ల ఈ జిగురు ఉత్పత్తి తగ్గిపోయి ఎసిడిటీ, అల్సర్లు, పేగు పూతలు వంటివి వస్తాయి. అరటిపండులోని ల్యూకోసైనడిన్ ఈ జిగురు పొరల నుండి ఎక్కువ స్రావం ఉత్పత్తి అయ్యేలా చేసి, పొట్టకు సహజమైన రక్షణను పెంచుతుంది. అల్సర్లు రాకుండా రక్షించడంలో అరటిపండు ఉపయోగపడుతుందని సైంటిఫిక్‌గా నిరూపించబడిన వాస్తవమని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే, కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చక్కెర పదార్థాలు, స్వీట్స్, జంక్ ఫుడ్స్ వంటి ఎసిడిక్ ఆహారాలు పొట్టలో ఇన్ఫ్లమేషన్స్‌కు కారణమవుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా అల్సర్లు వస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్స్‌ను తగ్గించి, ఎసిడిక్ ఫుడ్ వల్ల వచ్చే హానిని తొలగించడంలో అరటిపండు చక్కగా పనిచేస్తుందని 2019లో న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకులు సైంటిఫిక్‌గా నిరూపించారు. కడుపు మంటలు, అల్సర్లు ఉన్నవారు అరటిపండు తింటే మంచిదని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం.

ఎక్కువ అరటిపండ్లు తినాలంటే..

అరటిపండును ఎవరు ఎంత తినాలి అనే విషయానికి వస్తే, ఉదయం పూట బరువు తక్కువగా ఉన్నవారు, బరువు పెరగాలనుకునేవారు, శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు మొలకలతో పాటు ఒకటి లేదా రెండు, మూడు అరటిపండ్లు సాయంకాలం కూడా తీసుకోవచ్చు. అయితే, శారీరక శ్రమ చేయనివారు, బరువు ఎక్కువగా ఉన్నవారు, షుగర్ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఎప్పుడైనా ఒక చిన్న అరటిపండు మాత్రమే తీసుకోవాలి.

మిగతా పండ్లలో కేలరీలు తక్కువ ఉండేవి తీసుకుంటూ, వారంలో ఒకటి, రెండు రోజులు అధిక కేలరీలున్న అరటిపండు తీసుకోవడం వల్ల నష్టం ఉండదు. కర్బూజ, పుచ్చకాయ, బొప్పాయి వంటివి తక్కువ కేలరీలున్న పండ్లు. వీటిని మాత్రమే తింటే నీరసం వస్తుంది. ఒక అరటిపండును వీటితో పాటు తీసుకుంటే నీరసం రాకుండా, కడుపు నిండినట్లు ఉంటుంది.

పల్లెటూళ్లలో ఇప్పటికీ చాలామంది మజ్జిగ అన్నంలో, పెరుగు అన్నంలో అరటిపండును నంచుకుని తినే అలవాటు ఉంటుంది. ఆ రూపంలో లోపలికి వెళ్ళినా అరటిపండులోని ల్యూకోసైనడిన్ శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అరటిపండు తేలికగా జీర్ణమవుతుంది, తక్షణ శక్తిని ఇస్తుంది, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. మంచి పోషకాలను, ముఖ్యంగా పొటాషియంను అధికంగా అందిస్తుంది. పొటాషియం రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి, అరటిపండును తెలివిగా, సమతుల్యంగా ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
వయసు మరచి పల్టీలు కొడుతూ రైతు మల్లయ్య సంబురం.. వీడియో చూశారా..?
వయసు మరచి పల్టీలు కొడుతూ రైతు మల్లయ్య సంబురం.. వీడియో చూశారా..?