AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీళ్లు ఎక్కువగా తాగడం లేదా? వాటర్ సరిగ్గా తాగకపోతే మీకు వచ్చే సమస్యలు ఇవే..

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా నీళ్ల కోసం పరితపిస్తుంటారు చాలా మంది. కానీ నార్మల్ రోజులలో నీళ్ల సంగతి

నీళ్లు ఎక్కువగా తాగడం లేదా? వాటర్ సరిగ్గా తాగకపోతే మీకు వచ్చే సమస్యలు ఇవే..
Water Healthy
Rajitha Chanti
|

Updated on: May 31, 2021 | 10:44 PM

Share

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా నీళ్ల కోసం పరితపిస్తుంటారు చాలా మంది. కానీ నార్మల్ రోజులలో నీళ్ల సంగతి మర్చిపోతుంటారు. రోజుకీ తగినన్నీ నీళ్లు తాగరు. ఎప్పుడూ ఏదో పనిలో పడి నీళ్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే మరికొందరు బాగానే తాగుతున్నాం కదా అని సంతృప్తి చెందుతుంటారు. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండనివ్వాలి. ఇందుకోసం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. కానీ ప్రస్తుత హడావిడి జీవన విధానంలో చాలా మంది తగినన్ని వాటర్ తాగరు. దీంతో ఎప్పుడూ నీరసంగా ఉండడం.. తొందరగా అలసిపోవడం జరుగుతుంది. శరీరంలో తగినన్ని నీటి శాతం లేకపోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తగినన్నీ నీళ్లు తాగకపోడవం వలన వచ్చే సమస్యలు అధికంగానే ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

* సరిగ్గా నీళ్లు తాగని వారి ముఖంలో మొటిమల కంటే ఎక్కువ పరిమాణంలో గడ్డలు ఏర్పడుతుంటాయి. నీళ్లు తగినన్ని తాగేవారిలో మొటిమలు, యాక్నె వంటి సమస్యలు రావు. * కొంతమందికి ముఖమంతా కమిలిపోయి, కాంతిని కోల్పోయి ఉంటుంది. ముఖ్యంగా కళ్ల కింద మడతలు, వాపు ఉన్నాయంటే దాని అర్థం.. మీ ఒంట్లో నీటి శాతం తగ్గిందని. ముక్కు ఎర్రబడి, పొడిగా ఉన్నా నీటిలోపం ఉన్నట్లే అని అర్థం. అలాగే రోజంతా మత్తుగా, అలసటగా ఉండడం కూడా ఒక కారణమే. * నీరు ఎక్కువగా తీసుకోని వారిలో జుట్టు జీవం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా.. ఎక్కువగా చుండ్రు సమస్య వీరిని బాధపెడుతుంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే ఈ సమస్యలుండవు. * కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరానికి తగినంత పొటాషియంతోపాటు.. ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ ఉండాలి. ఈ రెండింటీని నీళ్లు ఎక్కువగా అందిస్తాయి. * భోజనానికి 20 నిమిషాల ముందు రెండు కప్పుల నీటిని తాగితే బరువు తగ్గుతారట.

Also Read: Smoking Corona: మీరు స్మోక్ చేస్తారా.? వెంట‌నే మానేయండి.. క‌రోనా స‌మయంలో ఇది చాలా డేంజ‌ర్‌.. మ‌ర‌ణం సంభవించే ఛాన్స్‌..

Avoid These Foods : వేసవిలో ఈ ఐదు ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి..! లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ..?

Increased Egg Prices : కొండెక్కిన గుడ్డు ధర..! ఒక్కోటి 6 నుంచి 8 రూపాయలు..? ఎగ్ రేట్లు ఎందుకు పెరిగాయో తెలుసుకోండి..