AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Usage: ఆహారంలో ఉప్పు ఎక్కువైందా..? ఈ 6 సులభమైన చిట్కాలతో సరిచేసుకోండిలా..

ఉప్పు ఎక్కువ అయితే పరిస్థితి ఏమిటి.? చాలా మందికి ఏం చేయాలో తెలియక నీళ్లను కలుపుతారు. లేదా మరింత ఎక్కువగా కూరను వండుతారు. ఎందుకంటే..

Salt Usage: ఆహారంలో ఉప్పు ఎక్కువైందా..? ఈ 6 సులభమైన చిట్కాలతో సరిచేసుకోండిలా..
Too Much Salt
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 25, 2023 | 1:40 PM

Share

తీసుకునే ఆహారం ఏదైనా దాని రుచిని పెంచడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో తినే వంటలో, లేదా ఆహారంలో ఉప్పు సరిపోదు. అలాంటి సందర్భాలలో సులభంగా మరి కొంత ఉప్పు కలిపవచ్చు. కానీ ఉప్పు ఎక్కువ అయితే పరిస్థితి ఏమిటి.? అప్పుడు ఏం చేయాలి..? చాలా మందికి ఏం చేయాలో తెలియక నీళ్లను కలుపుతారు. లేదా మరింత ఎక్కువగా కూరను వండుతారు. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఆహారానికి ఉన్న రుచి పోవడమే కాక చేదుగా ఉంటుంది. అయితే పొరపాటుగా మీరు మీ వంటలో ఉప్పు ఎక్కువగా వేస్తే దానిని అనేక రకాలుగా సరిచేయవచ్చు. ఇక్కడ మేము అందించే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.. మీ వంటకంలోని ఎక్కువైన ఉప్పు సమస్యను ఇట్టే పరిష్కరించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెడ్: కూరలోని ఉప్పును తగ్గించడానికి మీరు బ్రెడ్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం కూరలో బ్రెడ్ స్లైస్ వేసి 2 నిమిషాలు డిష్‌లో ఉంచండి. తర్వాత కూరలో నుంచి వాటిని తీసేయాలి.

పెరుగు: కూర చాలా ఉప్పగా ఉంటే దానికి 1 టేబుల్ స్పూన్ పెరుగును కలపవచ్చు. ఆ తర్వాత దాన్ని 5 నిమిషాలు ఉడికించాలి. ఫలితంగా కూరలోని ఉప్పు తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ సిరప్: ఇండియన్, మొఘలాయ్, చైనీస్ వంటకాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం డిష్‌లో కొంచెం నిమ్మరసం కలపండి. ఇది ఎక్కువగా ఉన్న ఉప్పును పీల్చుకుంటుంది.

తాజా మీగడ: కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే దానిని తగ్గడానికి తాజా మీగడను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఉప్పు తగ్గడమే కాకుండా మీ కూర రుచిగా మారుతుంది.

బంగాళాదుంపలు: ఆహారంలో అవసరానికి మించిన ఉప్పు ఉంటే దానిలో బంగాళదుంప ముక్కలను కలపండి. ఇది ఆహారంలో ఉండే అదనపు ఉప్పును గ్రహించేస్తుంది. అయితే మీరు మీ ఆహారంలోకి బంగాళాదుంప ముక్కలను కలిపే ముందు వాటిని బాగా కడగాలి. తరువాత ముక్కలపై తొక్క తొలగించి అప్పుడు కలపి 20 నిముషాలు కదపకుండా వదిలేయండి. తర్వాత ఉప్పు సరిగా ఉంటుంది.

ఉడికించిన బంగాళాదుంపలు: పప్పు లేదా కూర చాలా ఉప్పగా ఉంటే దానిలో ఉడికించిన బంగాళాదుంపలను ఉపయోగించవచ్చు. దీని కోసం కూర లేదా పప్పులో 2, 3 ఉడికించిన బంగాళదుంపలను కలిపితే చాలు. ఎక్కువైన ఉప్పును అవి గ్రహించుకుంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి