పెరుగుతో కలిపి ఇవి తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం.!

పెరుగును తేనెతో కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పెరుగుతో తేనె కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు, తేనె కలయిక వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతో కలిపి ఇవి తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం.!
Curd
Follow us
Venkata Chari

|

Updated on: Apr 21, 2022 | 4:29 PM

పెరుగు(Curd) తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందే. ముఖ్యంగా వేసవిలో దీని శీతలీకరణ ప్రభావం శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, శరీరానికి(Health) అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే పెరుగును తీసుకోవడం కూడా చాలా మంచిదని అంటుంటారు. పెరుగులో కొందరు పంచదార(Sugar) కలిపి తింటే, ఉప్పు, కారం కలిపి మరికొందరు తింటుంటారు. కానీ, ఎవరైనా పెరుగులో తేనె కలిపి తింటే మాత్రం, దాని నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంది. దీనికి కారణం తేనెలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల పెరుగులో కలిపి తింటే అందులో పోషకాలు పెరుగుతాయి.

హార్వర్డ్ హెల్త్ ప్రకారం, తేనెలో 17 శాతం నీరు, 31 శాతం గ్లూకోజ్, 38 శాతం ఫ్రక్టోజ్ ఉన్నాయి. దీనితో పాటు, ఇందులో జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. 1 టీస్పూన్ తేనెలో 64 క్యాలరీలు, 17.30 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉన్నాయని తెలిపారు.

చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం.. పెరుగు అనేక ప్రయోజనాలను అందిస్తుందని తెలిపింది. పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లకు చాలా మంచి మూలంగా ఉంటుంది. పెరుగును తేనెతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయడంలో..

ప్రోటీన్ శాఖాహార మూలాలలో పెరుగు ఒకటి అని అందరికీ తెలుసు. వ్యాయామం చేసే వారు వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ల ఆహారాన్ని తినాలని సూచించారు. పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తేనెలో అధిక మొత్తంలో గ్లూకోజ్ (కార్బోహైడ్రేట్ ఒక రూపం) ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగులో తేనె కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇది వ్యాయామం తర్వాత కూడా తినవచ్చు. ఇది కండరాల పునరుద్ధరణలో కూడా సహాయపడుతుంది.

ప్రోబయోటిక్స్‌కు మంచి మూలం..

తేనె, పెరుగు రెండూ ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రాథమికంగా బ్యాక్టీరియా, ఈస్ట్‌‌ను కలిగి ఉన్నాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ వేసవిలో పెరుగు తినాలని నిపుణులు సూచిస్తుంటారు. పెరుగును ఆహారంతో పాటు లేదా అల్పాహారంలో తీసుకోవచ్చు.

ఎముకలను బలపరచడంలో..

పెరుగులో ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు పోషకాలు కలిసి ఎముకలను దృఢపరుస్తాయి. ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో..

విటమిన్ సి పెరుగు, తేనెలో లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కరోనా మహమ్మారి సమయంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఉన్న ఆహారాన్ని తినమని సలహా ఇచ్చారని మనకు తెలిసిందే.

జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో..

వేసవి కాలంలో, ప్రజలు తరచుగా జీర్ణక్రియ ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కాబట్టి ప్రజలు తేలికపాటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, ఎవరైనా వేసవిలో ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో పెరుగు తీసుకుంటే, అతనికి పొట్ట సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణక్రియ కూడా సంపూర్ణంగా ఉంటుంది. మీరు భోజనంలో ప్రతిరోజూ 1 గిన్నె పెరుగు తినాలని లేదా 1 గ్లాసు లస్సీని తీసుకుంటే చాలా మంచింది. లస్సీకి తేనె కూడా కలిపిదే ఇంకా మంచిది.

వ్యాధుల నుంచి రక్షించేందుకు..

పెరుగు, తేనె కలిపి తింటే కొన్ని జబ్బులు కూడా నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులలో బోలు ఎముకల వ్యాధి, రక్తం గడ్డకట్టడం, అతిసారం, ఊబకాయం, కీళ్లనొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులు ఉన్నాయి.

Also Read: Alzheimer’s diet: చిన్నతనంలోనే మతిమరుపు వేధిస్తోందా? ఇవి తిన్నారంటే జ్ఞాపకశక్తి..

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు ఇట్టే కరుగుతుంది

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?