Alzheimer’s diet: చిన్నతనంలోనే మతిమరుపు వేధిస్తోందా? ఇవి తిన్నారంటే జ్ఞాపకశక్తి..
మతి మరుపు ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారిని వేధిస్తోంది. ఐతే సరైన జీవనశైలితోపాటు, కొన్ని ఆహార అలవాట్ల ద్వారా బుర్రను షార్ప్ చేసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇదేమీ..
Diet and Prevention of Alzheimers disease: మతి మరుపు ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారిని వేధిస్తోంది. ఐతే సరైన జీవనశైలితోపాటు, కొన్ని ఆహార అలవాట్ల ద్వారా బుర్రను షార్ప్ చేసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇదేమీ నయం చేసుకోలేని జబ్బుకాదు. మెదడుకు మేత పెట్టే కొన్ని రకాల ఆహారాల గురించి హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ న్యూట్రిషనల్ అండ్ లైఫ్‌స్టైల్ సైకియాట్రీ డాక్టర్ ఉమానాయుడు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
- పాలకూర: ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..
- కాఫీ/ టీ: రోజూ రెండు నుంచి మూడు కప్పులకు మించకుండా తాగే కాఫీ లేదా టీ వల్ల మెమరీ పెరుగుతుంది. చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది.
- చేపలు: ఆహారపుటలవాట్లను బట్టి,ఇష్టాయిష్టాలను బట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేపలు తింటే ఏకాగ్రత పెరుగుతుంది..
- క్యారట్: వయసు పెరగడం వల్ల వచ్చే మెమరీ సమస్యలను తగ్గిస్తుంది..
- వాల్ నట్స్: జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు స్కిల్స్ మెరుగుపడుతాయి.
పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, తక్కువ మొత్తంలో తీసుకునే రెడ్ మీట్ అల్జీమర్స్ అనే ఒక విధమైన మతిమరపు వ్యాధిని నిరోధిస్తాయని తెలిసిందే. వీటితో కూడా బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు.
ఇవి మనం తీసుకునే ఆహారం… వీటితోపాటు పజిల్స్ పూరించడం, చెస్ ఆడటం, చిన్నప్పుడు విన్న పద్యాలు, ఇష్టమైన పాటలు గుర్తు చేసుకుంటూ వాటిని రాయడం వంటి మెదడుకు పెట్టే మేత వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
Also Read: