AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు.. ఈ ఐదు ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..

Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్

పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు.. ఈ ఐదు ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..
Sunflower
uppula Raju
|

Updated on: Nov 24, 2021 | 9:15 PM

Share

Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చు. చాలా మంది ఈ విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. ఈ నలుపు రంగు విత్తనాలు ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

1. గుండె ఆరోగ్యం కోసం చలికాలం హృద్రోగులకు కష్టాలను పెంచుతుంది. ఈ పరిస్థితిలో పొద్దుతిరుగుడు విత్తనాలు వారి అన్ని సమస్యలను అధిగమించగలవు. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల రక్త నాళాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగపడుతుంది. ఇవి హై బీపీని నియంత్రిస్తాయి. ఈ విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒలీక్, లినోలిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ విత్తనాలు ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

2. మధుమేహం కోసం మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు విత్తనాలను చిరుతిండిగా తినవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.

3. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే మీరు చాలా త్వరగా వ్యాధుల బారిన పడినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ విత్తనాలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్, సెలీనియం మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి.

4. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వ్యక్తికైనా చాలా ప్రమాదకరం. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ సందర్భంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది.

5. బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షిస్తుంది ఈ విత్తనాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఈ గింజల్లో పుష్కలంగా కొవ్వులు, మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లు, విటమిన్ ఈ, బి-కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షిస్తాయి.

Jiophone Next: జియో ఫోన్‌ విక్రయాలు ప్రారంభం.. ధర, ఆఫర్‌లు ఏ విధంగా ఉన్నాయంటే..?

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?

CAT 2021 Exam: CAT పరీక్ష కోసం IIM మార్గదర్శకాలు విడుదల.. ఈ విషయాలను గుర్తుంచుకోండి

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు