Vegan Milk: శాఖాహార పాలు అంటే ఏమిటి.. వాటిల్లో రకాలు.. ఉపయోగాలు..

Vegan Milk: మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ముఖ్యంగా మాంసాహారులు క్రమంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ శాఖాహారులుగా..

Vegan Milk: శాఖాహార పాలు అంటే ఏమిటి.. వాటిల్లో రకాలు.. ఉపయోగాలు..
Vegan Milk
Follow us

|

Updated on: Nov 24, 2021 | 8:50 PM

Vegan Milk: మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ముఖ్యంగా మాంసాహారులు క్రమంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ శాఖాహారులుగా మారుతున్నారు. ఎక్కువమంది మాంసం, జంతువుల నుంచి వచ్చే పాల పదార్ధాలను, జంతు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుంటూ వేగన్ గా మారుతున్నారు. శాఖాహార ఉత్పత్తులవైపు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే వేగన్ అంటే శాకాహార పాలు అని అర్ధం. వీటిని మొక్కల ఉత్పత్తులనుంచి తయారు చేస్తారు. మొక్కల నుంచి సేకరించిన ఈ పాలు కూడా జంవుతుల నుంచి సేకరించిన పాలు వలే రుచి, ఆరోగ్యాన్నిచ్చే లక్షణాలు కలిగి ఉంటాయి.

జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తుల వలన వచ్చే అలర్జీలున్నవారికి మంచి ప్రత్యమ్నాయ ఎంపిక ఈ వేగన్  పాలు. తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం .. వివిధ పదార్ధాల తయారీ .. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే వేగన్ పాల పై  ప్రస్తుతం ప్రపంచ జనాభా దృష్టి సారిస్తుంది. రోజు రోజుకీ మొక్కల ఆధారిత పాలకు డిమాండ్ పెరుగుతుండటంతో, శాకాహారి పాలు (వేగన్ పాలు) ఎలాంటి మొక్కల నుండి సేకరిస్తారు ఈరోజు తెలుసుకుందాం..

సోయా మిల్క్: జంతువుల పాలల్లో ఆవు పాలు ఎంత శ్రేష్ఠమైనవో.. శాఖాహార పాలల్లో సోయా పాలు కూడా అంతే శ్రేష్ఠమైనవని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకనే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు వైపు చూస్తున్నారు.  సోయా బీన్స్ నుంచి తయారు చేసిన సోయా మిల్క్ లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ఈ పాలల్లో ప్రోటీన్, పొటాషియం, ఐసోప్లేవోన్ లు పుష్కలంగా ఉన్నాయి.

బాదం పాలు:  శాకాహారి పాలలో రెండవ ప్రసిద్ధ ఎంపిక, మార్కెట్ లో లభించే మరో శాఖాహార పాలు బాదం మిల్క్. ఈ పాలను బాదం పప్పు నానబెట్టి… తయారు చేస్తారు. సోయాపాలతో పోలిస్తే బాదం పాలలో  చాలా రాగి, జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్స్ డి, ఈ, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు బాదం పాలు  మృధువుగా, సున్నితంగా ఉంటాయి. పాలు అలెర్జీ ఉన్న పిల్లలకు, పెద్దలకు బాదం పాలు మంచి  ప్రత్యామ్నాయమని పరిశోధకులు సూచించారు.

కొబ్బరి పాలు:  కొబ్బరి నుంచి తీసే పాలను కొబ్బరి పాలు అంటారు. ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయి. బాదం పాల కంటే తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇతర మొక్కల ఆధారిత పాల రకాలతో పోల్చితే.. కొబ్బరి పాలను వంట, బేకింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి ఆహారానికి మంచి రుచి, సుగంధాన్ని ఇస్తుంది. ఈ పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఈ పాలల్లో విటమిన్ డి, బి 2, బి 12, కాల్షియం వంటివి పుష్కలంగా ఉన్నాయి.

బియ్యం పాలు: ఈ రైస్ మిల్క్  ను బియ్యం నీరు కలిపి తయారు చేస్తారు. తీపి రుచిని కలిగి ఉండే ఈ  బియ్యం పాలలో అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇతర శాఖాహార పాలతో పోలిస్తే బియ్యం పాలల్లో మాంగనీస్, సెలీనియం అధికంగా ఉంటుంది.

జనపనార పాలు : రుచి లేని జనపనార పాలు.. శరీరంలోని శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి,తెలుపుతున్నాయి.

వోట్ పాలు: ఓట్స్ నుండి సహజంగా తీసిన పాలు వోట్ పాలు. ఈ పాలు పోషకమైనవి. అంతేకాదు కరిగే ఫైబర్ కలిగి ఉన్నాయి. విటమిన్లు , కాల్షియం సమృద్ధిగా ఉన్న ఈ పాలలో తక్కువ సంతృప్త కొవ్వు పదార్ధం ఉంటుంది. ఇతర రకాల మొక్కల ఆధారిత పాలతో పోల్చితే, ఓట్ పాలలో అత్యధిక కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

జంతువుల నుంచి వచ్చే డైరీ పాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. వివిధ అధ్యయనాలు, నివేదికలు మొక్కల ఆధారిత పాలు పెద్దల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని సూచిస్తున్నాయి. డైరీ పాలతో పోలిస్తే శాకాహారి పాలలో చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి.  దీంతో పిల్లలకు, పెద్దలకు త్వరగా జీర్ణమవుతాయి.

Also Read:   ఈ గేదె తెలివి తేటలు మాములుగా లేవుగా దాహం తీర్చుకోవడానికి.. చేసిన పని చూస్తే ఔరా అనకమానరు ఎవరైనా..