Viral Video: ఈ గేదె తెలివి తేటలు మాములుగా లేవుగా దాహం తీర్చుకోవడానికి.. చేసిన పని చూస్తే ఔరా అనకమానరు ఎవరైనా..
Viral Video: ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు.. అలాగే అవసరం అన్ని పనులను నేర్పిస్తుంది. అది మనుషులకైనా, జంతువులకైనా.. ఈ విషయాన్నీ కోతి. గున్న ఏనుగు,..

Viral Video: ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు.. అలాగే అవసరం అన్ని పనులను నేర్పిస్తుంది. అది మనుషులకైనా, జంతువులకైనా.. ఈ విషయాన్నీ కోతి. గున్న ఏనుగు, కుక్క. పిల్లి వంటి జంవుతువులు రుజువు చేశాయి. వాటికీ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ గేదె వంతు వచ్చింది. గతంలో ఏనుగు పిల్ల దాహం తీర్చుకోవడానికి చేతి పంపుని కొట్టు.. నీరుని తాగినట్లుగానే తాజాగా ఓ గేదె దాహం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఓ గేదె దాహం తీర్చుకోవడానికి చేతి పంపుని తన కొమ్ములతో ఆపరేట్ చేస్తోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పుడు చెప్పండి ఈ గేదె శారీరకంగా బలమేకాదు.. తెలివి తేటలు కూడా ఉన్నాయి అంటూ కామెంట్ కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో నెటిజన్లను ఆకట్టుకుంది. ఇప్పటికే 2.12లక్షల మంది వీక్షించారు.
ఓ గేదెల మంద చేతి పంపు చుట్టూ నిలబడి ఉంది. ఆ మందలోని ఒక గేదె నీటిని పంపుని ఉపయోగించింది. దాహం తీర్చుకోవడానికి పంపు హ్యాండిల్ ను తన కొమ్ముతో కొడుతూ.. నీరు కింద పడగానే ఆ నీటితో తన దాహం తీర్చుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ఓ రేంజ్ లో వైరల్ అయింది.
अब बताओ – “अक्ल बड़ी या भैंस”? ? pic.twitter.com/ee4bipnEGZ
— Dipanshu Kabra (@ipskabra) November 19, 2021
Also Read: అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల బరిలో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. డిసెంబర్‌లో ఎన్నికలు