AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: BWF అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల బరిలో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. డిసెంబర్‌లో ఎన్నికలు

PV Sindhu: భారత స్టార్ షట్లర్.. తెలుగు తేజం పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) అథ్లెట్ల కమిషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నది. డిసెంబరు 17న స్పెయిన్‌లో జరిగే..

PV Sindhu: BWF అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల బరిలో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. డిసెంబర్‌లో ఎన్నికలు
Pv Sindhu
Surya Kala
|

Updated on: Nov 24, 2021 | 7:01 PM

Share

PV Sindhu: భారత స్టార్ షట్లర్.. తెలుగు తేజం పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) అథ్లెట్ల కమిషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నది. డిసెంబరు 17న స్పెయిన్‌లో జరిగే BWF అథ్లెట్ల కమిషన్ ఎన్నికల్లో భారత్‌కు చెందిన  పీవీ సింధు పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఆరు మహిళా స్థానాల కోసం పోటీ జరగనుండగా.. మొత్తం తొమ్మిది మంది పోటీపడుతున్నారు.  ఈ అథ్లెట్స్ కమిషన్ 2021 నుంచి 2025 వరకు అమల్లో ఉంటుంది. రీ ఎలక్షన్ కోసం పోటీ పడుతున్న ఏకైక ప్లేయర్ పీవీ సింధు. ఈ విషయాన్ని BWF అధికారికంగా ప్రకటించింది.

అంతకుముందు 2017లో సింధు మొదటిసారి అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైంది. సింధుతో పాటు ఇండోనేషియా విమెన్స్ డబుల్స్ ప్లేయర్ గ్రేషియా పొలీలి కూడా పోటీలో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన ఇండోనేషియా మహిళల డబుల్స్ క్రీడాకారిణి గ్రేసియా పోలితో సింధు చేరనుంది. పోలి మాట్లాడుతూ.. తాను తన తోటి క్రీడాకారులకు.. వారి కలలను సాకారం చేసుకోవడానికి సహాయం చేయాలనుకుంటున్నానని పోలి చెప్పింది.

BWF అథ్లెట్ల కమిషన్ ఎన్నికల్లో పోటీకి నామినేట్ చేయబడిన ఇతర ఆటగాళ్లలో స్కాట్లాండ్‌కు చెందిన ఆడమ్ హాల్, ఈజిప్ట్‌కు చెందిన హడియా హోస్నీ, యుఎస్‌ఎకు చెందిన ఐరిస్ వాంగ్, కొరియాకు చెందిన కిమ్ సోయోంగ్, నెదర్లాండ్‌కు చెందిన రాబిన్ టాబెలింగ్, ఇరాన్‌కు చెందిన సొరయా అఘైహాజియాఘా లతో పాటు చైనాకు చెందిన జెంగ్ సి వీ ఉన్నారు.

అథ్లెట్ల కమిషన్ చైర్‌ను కొత్త అథ్లెట్ల కమిషన్ ఎన్నుకుంటుంది , BWF రాజ్యాంగం ప్రకారం అవసరమైన పరిశీలన ప్రక్రియ తర్వాత ఆ వ్యక్తి BWF కౌన్సిల్ మెంబర్ అవుతాడు. ఈ ఏడాది మేలో.. సింధు IOC యొక్క ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ ప్రచారానికి అథ్లెట్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పీవీ సింధు బాలి లో జరుగుతున్నఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 ఈవెంట్‌లో  ఆడుతుంది.

Also Read:

యాసంగి పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎమన్నారంటే..?

వరదలో కొట్టుకుపోయిన పెనివిటి కోసం కోసం ఓ మహిళ వెతుకులాట.. కన్నీరుమున్నీరు..