AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Hockey World Cup: సంజయ్ హ్యాట్రిక్ వృథా.. 5-4 తేడాతో భారత్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్..!

భారత హాకీ జట్టు ఢిపెండింగ్ ఛాంపియన్‌గా ఎఫ్‌ఐహెచ్ జూనియర్ ప్రపంచకప్‌లోకి ప్రవేశించింది. కానీ, ఆశించిన స్థాయిలో మాత్రం ప్రారంభం లభించలేదు.

Junior Hockey World Cup: సంజయ్ హ్యాట్రిక్ వృథా.. 5-4 తేడాతో భారత్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్..!
France Beat India In The Fih Junior Mens Hockey World Cup
Venkata Chari
|

Updated on: Nov 25, 2021 | 8:29 AM

Share

Junior Hockey World Cup, India vs France: ఢిపెండిండ్ ఛాంపియన్ భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆశించిన విధంగా ప్రారంభించలేకపోయింది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా జరిగిన పూల్-బీ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 5-4తో భారత్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ సంజయ్ హ్యాట్రిక్ కొట్టినా.. అతని అద్భుత ప్రదర్శన వృథా అయింది. ఫ్రాన్స్ తరఫున కెప్టెన్ తిమోతీ క్లెమెంట్ తొలి 23, 32 నిమిషాల్లో గోల్స్ చేశాడు. వీరితో పాటు ఏడో నిమిషంలో బెంజమిన్ మెక్యూ గోల్ చేయగా, 48వ నిమిషంలో కొరెంటిన్ సెయిలర్ గోల్స్ సాధించారు.

భారత్ తరపున సంజయ్ 15, 57, 58 నిమిషాల్లో గోల్స్ చేశాడు. మూడు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలిచాడు. భారత్ తరపున 10వ నిమిషంలో ఉత్తమ్ సింగ్ మరో గోల్ చేశాడు. సంజయ్ చివరి నిమిషంలో రెండు గోల్స్ చేయడం ద్వారా రిజల్ట్‌ను మార్చడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికీ గోల్ గ్యాప్ మిగిలి ఉండడంతో భారత్ ఓటమిపాలైంది.

ఆరంభం నుంచే ఫ్రాన్స్ ఒత్తిడి.. భారత్‌పై ఫ్రాన్స్‌ మొదటి నుంచి ఒత్తిడి తెచ్చింది. తొలి నిమిషంలోనే గోల్ కొట్టి భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ తన స్లో డిఫెన్స్ భారాన్ని భరించాల్సి వచ్చింది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న క్లైమెంట్ ఫ్రాన్స్‌కు గోల్‌ చేశాడు. ఇక్కడి నుంచి ఫ్రాన్స్ ఆత్మవిశ్వాసం పెంచుకుని దూకుడు పెంచింది. భారత్‌ సర్కిల్‌లో నిరంతరం దాడి చేస్తూనే ఒత్తిడి పెంచారు. ఈ గ్యాప్‌లోనే రెండో గోల్ కూడా సాధిచింది. ఏడో నిమిషంలో బెంజమిన్ ఫ్రాన్స్ తరఫున రెండో గోల్ చేశాడు.

పుంజుకున్న భారత్.. అయితే 0-2తో వెనుకబడిన భారత జట్టు పునరాగమనం చేసింది. 10వ నిమిషంలో భారత తమ తొలి ఖాతా తెరిచింది. ఫీల్డ్ గోల్ చేయడం ద్వారా ఉత్తమ్ భారత్ ఖాతా తెరిచాడు. దీని తరువాత, భారత ప్లేయర్లు నిరంతర దాడులు చేశారు. కానీ ఫ్రాన్స్ రక్షణ ధోరణితో విజయం సాధించడం కష్టంగా మారింది. అయితే తొలి క్వార్టర్‌ చివరి నిమిషంలో సంజయ్‌ భారత్‌ను సమం చేశాడు. ఇక్కడ భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. రెండో క్వార్టర్‌లో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించినా అత్యుత్తమ గోల్‌ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ మరోసారి భారత్‌ను వెనక్కి నెట్టింది. 23వ నిమిషంలో బెంజమిన్ తన జట్టుకు మూడో గోల్‌ సాధించాడు. ఇక్కడ ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించడంతో కెప్టెన్ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.

మ్యాచ్ అర్థభాగానికి రెండు నిమిషాల ముందు, భారత్‌కు నాల్గవ పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే ఫ్రెంచ్ గోల్‌కీపర్ అద్భుతమైన డిఫెన్స్‌తో భారత్‌ను సమం చేయనివ్వలేదు. దీంతో హాఫ్ టైమ్‌కు భారత్ 2-3 తేడాతో వెనుకంజలో నిలిచింది.

మూడో క్వార్టర్‌లో ఫ్రాన్స్ ఆధిపత్యం.. ఫ్రాన్స్ ఒక గోల్‌తో ఆధిక్యంలో ఉంది. మూడో క్వార్టర్‌లో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి. చివరి అవకాశాన్ని చేజిక్కించుకున్న క్లెమెంట్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 38వ నిమిషంలో భారత్‌కు మూడో గోల్‌ చేసే అవకాశం లభించినా.. ఈ సమయంలో లభించిన పెనాల్టీ కార్నర్‌లో భారత్‌ గోల్‌ చేయలేకపోయింది. 10 నిమిషాల తర్వాత, సెయిలర్ ప్రయత్నంతో ఫ్రాన్స్ ఐదో గోల్ చేసింది. ఇక్కడ నుంచి భారత్ ఓటమి ఖాయమనిపించింది. చివరి నిమిషాల్లో భారత్ దూకుడుగా ఆడింది. 57వ, 58వ నిమిషాల్లో అవకాశాలు లభించాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైంది.

Also Read: IND vs NZ: స్వదేశంలో తొలి WTC సిరీస్‌ ఆడనున్న భారత్.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

IPL 2022: కోహ్లీ ఫ్రెండ్‌కు చుక్కెదురు.. మెగా ఆక్షన్‌లోకి కీలక ఆటగాళ్లు.. మారనున్న టీమ్స్ రూపురేఖలు.!