AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: కోహ్లీ ఫ్రెండ్‌కు చుక్కెదురు.. మెగా ఆక్షన్‌లోకి కీలక ఆటగాళ్లు.. మారనున్న టీమ్స్ రూపురేఖలు.!

ఐపీఎల్ 2022పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది టోర్నీని ఇండియాలో జరిపేందుకు సన్నద్దమవుతోంది. మునపటి కంటే మూడింతల...

IPL 2022: కోహ్లీ ఫ్రెండ్‌కు చుక్కెదురు.. మెగా ఆక్షన్‌లోకి కీలక ఆటగాళ్లు.. మారనున్న టీమ్స్ రూపురేఖలు.!
IPL 2022 Retention Players List
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 27, 2021 | 12:21 PM

Share

ఐపీఎల్ 2022పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది టోర్నీని ఇండియాలో జరిపేందుకు సన్నద్దమవుతోంది. మునపటి కంటే మూడింతల ఎంటర్టైన్మెంట్‌తో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా మరో రెండు టీమ్స్ కూడా పాల్గొనబోతున్నాయి. అందుకు సంబంధించిన బిడ్‌లు కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మాదాబాద్, లక్నో నగరాల నుంచి రెండు టీంలు వచ్చే సీజన్‌లో చేరనున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. వచ్చే సీజన్‌కు తమ జట్టులో రిటైన్ చేసుకునే ప్లేయర్స్‌పై మల్లగుల్లాలు పడుతున్నాయి. అనుభవం, ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈసారి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రిటైన్ చేసుకునే ప్లేయర్స్‌కు సంబంధించిన కసరత్తులు జరుగుతుండగా.. ఈ ప్రక్రియకు నవంబర్ 30 చివరి తేదీగా బీసీసీఐ ప్రకటించింది. అప్పట్లోగా ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్స్‌(3 భారత్ లేదా 2 విదేశీ)ను రిటైన్ చేసుకోవాలి. ‘రైట్ టూ మ్యాచ్’ కార్డు(RTM) ఆప్షన్ లేదు. అటు కొత్తగా చేరిన రెండు జట్లు ఆక్షన్‌లోకి వచ్చిన ప్లేయర్స్ నుంచి ముగ్గురిని ఎంపిక చేసుకోనున్నారు. ఇక మెగా ఆక్షన్ జనవరి మొదటి వారంలో జరగనుంది.

అటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ నుంచి బయటికొచ్చిన కెఎల్ రాహుల్.. లక్నో టీంకు కెప్టెన్‌గా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కూడా కొత్త ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చినట్లు వినికిడి. అయితే స్కై నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ స్నేహితుడు, టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కూడా ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఫ్రాంచైజీల వారీగా ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉండబోతోందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అదేంటో చూసేద్దాం పదండి.

ఐపీఎల్ టీమ్స్ రిటైన్ ప్లేయర్స్ లిస్టు
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, కీరన్ పొలార్డ్(చర్చల్లో), ఇషాన్ కిషన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యుజవేంద్ర చాహల్, దేవదూత్ పడిక్కల్
ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, కసిగో రబాడా
సన్‌ రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్
రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్
కోల్‌కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, శుభ్‌మాన్ గిల్ లేదా వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మయాంక్ అగర్వాల్, మహమ్మద్ షమీ
చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ లేదా సామ్ కరన్

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?