Watch Video: అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా బౌలర్.. కోపంతో ఏం చేశాడో తెలుసా?
దక్షిణాఫ్రికా ఏ (South Africa A vs India A 1st unofficial Test)తో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్ ఏ రెండవ రోజు 1 వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంకా 384 పరుగులు వెనుకంజలో నిలిచింది.
South Africa A vs India A 1st Unofficial Test: దక్షిణాఫ్రికాతో బ్లూమ్‌ఫోంటైన్‌లో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు రాహుల్ చాహర్ వివాదంలో చిక్కుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత్-ఏ లెగ్ స్పిన్నర్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అంపైర్ నిర్ణయంపై కోపంతో రాహుల్ చహర్ ఆగ్రహంతో తన కళ్ల అద్దాలు విసిరికి కొట్టాడు. రాహుల్ చాహర్ కోపంతో ఊగిపోయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ 128వ ఓవర్లో రాహుల్ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఏ వికెట్ కీపర్ క్వేషెల్ ప్యాడ్‌లకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రాహుల్ చాలా త్వరగా అప్పీల్ చేశాడు. దానిని అంపైర్ తిరస్కరించాడు. దీంతో అంపైర్‌పై రాహుల్ చాహర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలుత అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన అతడు తన కళ్లద్దాలు తీసి గ్రౌండ్‌పైకి విసిరాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ రాహుల్ చాహర్‌కు చాలా నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ చాహర్ 125 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. రాహుల్ చాహర్ ఎకానమీ రేటు కూడా ఓవర్‌కు 4.38 పరుగులుగా మారింది. ఇక టీమిండియా ఇతర బౌలర్లు.. నవదీప్ సైనీ, అర్జన్ నాగ్వాస్వాలా తలో 2 వికెట్లు పడగొట్టారు. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు.
దక్షిణాఫ్రికా ఏ భారీ స్కోరు.. అంతకుముందు దక్షిణాఫ్రికా ఏ 509 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ పీటర్ మలాన్ 163, టోనీ డి జార్జి 117 పరుగులు చేశారు. వికెట్ కీపర్ క్వెషీల్ 82 పరుగులతో రాణించాడు. జాసన్ స్మిత్ 52, జార్జ్ లిండే 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. కెప్టెన్ ప్రియాంక్ పంచాల్ 45, అభిమన్యు ఈశ్వరన్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. పృథ్వీ షా 45 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సిపమ్లా వేసిన బంతికి షా వికెట్ కీపర్ క్యూషెలేకు క్యాచ్ ఇచ్చాడు. రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ ఇంకా 384 పరుగులు వెనుకంజలో ఉంది. భారత జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. హనుమ విహారి, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్ వంటి బ్యాట్స్‌మెన్ జట్టుతో ఉన్నారు. దీంతో పాటు కృష్ణప్ప గౌతమ్ కూడా బాగా బ్యాటింగ్‌లో అండగా ఉన్నాడు.
Rahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call.
A double appeal and throwing his equipment. #SAAvINDA
Footage credit – @SuperSportTV pic.twitter.com/TpXFqjB94y
— Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021