AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Hockey World Cup: కెనడాపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. 13-1 తేడాతో భారత్ తొలి విజయం నమోదు

ప్రపంచకప్‌లో గురువారం భారత్ మాత్రమే కాదు, అర్జెంటీనా, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి జట్లు కూడా తమ తమ మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించాయి.

Junior Hockey World Cup: కెనడాపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. 13-1 తేడాతో భారత్ తొలి విజయం నమోదు
Junior Hockey World Cup Ind Vs Can
Venkata Chari
|

Updated on: Nov 26, 2021 | 6:39 AM

Share

Junior Hockey World Cup: ఎఫ్‌ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ 2021లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. భారత జూనియర్ హాకీ జట్టు ప్రపంచకప్‌లో తమ రెండో మ్యాచ్‌లో కెనడాను 13-1తో ఏకపక్షంగా ఓడించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 4-5 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. డ్రాగ్-ఫ్లిక్కర్ సంజయ్ భారత్ తరఫున వరుసగా రెండో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అతడితో పాటు అరిజిత్ హుండాల్ కూడా హ్యాట్రిక్ సాధించాడు. తొలి అర్ధభాగంలో భారత జట్టు కేవలం 4 గోల్స్ చేయగా, రెండో అర్ధభాగంలో 9 గోల్స్ చేసింది. ఇందులోనూ మ్యాచ్ చివరి క్వార్టర్‌లో 6 గోల్స్ వచ్చాయి. భారత్ తరఫున ఉత్తమ్ సింగ్, శారదా నంద్ తివారీ 2-2తో స్కోరు చేయగా, కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్, మణీందర్ సింగ్, అభిషేక్ లక్రా ఒక్కో గోల్ చేశారు. కెనడా తరఫున క్రిస్టోఫర్ టార్డిఫ్ ఏకైక గోల్ చేశాడు.

మ్యాచ్ మూడో నిమిషంలోనే ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. 8వ నిమిషంలో భారత్‌ ఆధిక్యం రెండింతలైంది. జట్టు తరఫున కెప్టెన్ వివేక్ ఈ గోల్ చేశాడు. తొలి క్వార్టర్ 2-0తో ముగిసింది. రెండవ క్వార్టర్ ప్రారంభమైన వెంటనే, భారత్‌కు 17వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించింది. భారత జట్టు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ డ్రాగ్-ఫ్లిక్కర్ సంజయ్ మరోసారి హ్యాట్రిక్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 27వ నిమిషంలో మణిందర్ జట్టును 4-0తో ఆధిక్యంలో నిలిపాడు. రెండవ క్వార్టర్ ముగియడానికి ఒక నిమిషం ముందు, క్రిస్టోఫర్ జట్టు కోసం గోల్ చేయడం ద్వారా కెనడాకు పునరాగమనంపై ఆశలు పెంచాడు.

మూడు, నాలుగో క్వార్టర్లలో భారత్ ఆధిక్యం.. కెనడా ఏదశలోనూ భారత్‌ను ఎదుర్కొనలేకపోయింది. భారతదేశం నుంచి మరింత బలమైన దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. తొలి అర్ధభాగంలో 4-1తో ఆధిక్యంలో నిలిచిన టీమ్ ఇండియా రెండో అర్ధభాగంలో మరింత వేగం కనబరిచింది. 32వ నిమిషంలో సంజయ్ అద్భుత ప్రదర్శన చేసి 5-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 35వ నిమిషంలో శారదా నంద్ పీసీని గోల్‌గా మలిచింది. ఈ క్వార్టర్‌లో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌లు లభించడం కొనసాగించింది. జట్టు వాటిని గోల్‌గా మారుస్తూనే ఉంది. 40వ నిమిషంలో అరిజిత్ హుండాల్ అదే పని చేశాడు. ఇది మ్యాచ్‌లో అతనికి మొదటి, ఏడో గోల్.

మూడో క్వార్టర్ ముగిసే సమయానికి 7-1తో ముందంజలో ఉన్న టీమ్ ఇండియా.. ఆ తర్వాత చివరి క్వార్టర్‌లో గోల్స్ వర్షం కురిపించింది. ఈ క్వార్టర్‌లో భారత్‌ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 6 గోల్స్‌ చేసింది. ఈ 15 నిమిషాల్లో అరిజిత్ మరో రెండు గోల్స్ చేయగా, శారదా నంద్, ఉత్తమ్ సింగ్, సంజయ్, అభిషేక్ లక్రా గోల్స్ చేయడంతో భారత్ 13-1తో విజయం సాధించింది.

మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ఫలితమే.. భారత్‌ మాత్రమే కాకుండా మరికొన్ని మ్యాచ్‌ల్లో గోల్స్‌ వర్షం కురవగా.. ఇతర గ్రూప్‌ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 14-0తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. అదే సమయంలో, కొరియా 12-5తో నెదర్లాండ్స్ ముందు ఓడిపోయింది. స్పెయిన్ 17-0తో అమెరికాను ఓడించింది. భారత గ్రూప్‌లో ఫ్రాన్స్ 7–1తో పోలాండ్‌ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

Also Read: విరాట్, రవిశాస్త్రి వద్దన్నారు.. దక్షిణాఫ్రికా ఏపై సెంచరీ బాది సత్తా చాటాడు.. రాహుల్ ద్రవిడ్‌ అయినా ఆదరించేనా?

Royal Challengers Bangalore: ఆర్‌సీబీ ఆ ఇద్దరిని రిటైన్ చేసుకుంటుందా.. ఎవరు వారు..