AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీరు దెయ్యాలున్నాయంటే నమ్మరా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి..

అప్పుడప్పుడు దెయ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. అదేవిధంగా పారానార్మల్‌ యాక్టివిటీస్‌ సంఘటనలు కూడా మనకు దర్శనమిస్తుంటాయి

Viral Video: మీరు దెయ్యాలున్నాయంటే నమ్మరా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి..
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 6:06 PM

Share

అప్పుడప్పుడు దెయ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. అదేవిధంగా పారానార్మల్‌ యాక్టివిటీస్‌ సంఘటనలు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగించే విధంగా, నమ్మశ్యం కాని విధంగా ఉంటాయి. నిజంగా దెయ్యాలున్నాయని నమ్మించేలా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూకేలోని సదర్లాండ్‌ బార్‌లో దెయ్యం బీర్‌ గ్లాస్‌ని కింద పడేసినట్లు సాక్షాత్తూ ఆ బార్‌ యజమాని కేట్‌ అండర్సన్‌ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీనిని చూస్తుంటే నిజంగా దెయ్యాలున్నాయేమో అనిపించక మానదు.

బ్లూ హౌజ్ పబ్ అనే పేరుతో ఉన్న ఈ బార్‌లో నలుగురు వ్యక్తులు లోపల ఉండగా.. కస్టమర్ ఒక్కడే వాళ్ల ముందు కూర్చొని ఉంటాడు. బార్‌ నిర్వాహకులు గ్లాస్ నిండా బీర్ పోసి కస్టమర్‌ ముందు ఉంచారు. కొద్దిక్షణాల తర్వాత గ్లాసు కొంచెం ముందుకు జరిగి హఠాత్తుగా పడిపోయింది. పైగా ఆ సమయంలో అక్కడ కస్టమర్‌ తప్ప ఇంకెవరూ లేరు. ఇలా ఎవరూ తాకకుండానే ఉన్నట్టుండి పడిపోయిన గ్లాస్‌ను చూసి అంతా షాక్‌లో మునిగిపోయారు. వీడియోను చూసిన చాలామంది కూడా గ్లాస్‌ ఎలా పడిపోయిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కాగా 167 ఏళ్ల ఈ బార్‌ అతి పురాతనమైనదని, గతంలో కూడా ఇలాంటి పారానార్మల్‌ యాక్టివిటీస్‌ జరిగాయని ఈ బార్‌కొచ్చే కస్టమర్లు చెబుతున్నారు.

Also Read:

Viral Video: ముళ్ల పందా.. మజాకా..! చిరుతకు చుక్కలు చూపించింది.. చిరాకు తెప్పించింది

Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!

Viral Video: పిల్లి పిల్లపై విరుచుకుపడిన మూడు పులులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో