Sabja Seeds: బరువు తగ్గడానికి ప్రయత్నించి విసిగిపోతున్నారా ? అయితే సబ్జా గింజలను మీ ఆహారంతో జత చేసి తీసుకుంటే రిజల్ట్ పక్కా..
సబ్జా గింజలలో ఎన్నో రకాల ఔషద గుణాలున్నాయి. వీటిని తినడం వలన అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇవి ఆమ్లం..
Sabja Seeds: సబ్జా గింజలలో ఎన్నో రకాల ఔషద గుణాలున్నాయి. వీటిని తినడం వలన అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇవి ఆమ్లం.. గుండెల్లో మంట, రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. అలాగే శరీరంలోని వేడిని తగ్గించడానికి సహాయపడతాయి. సబ్జా గింజలలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండడం వలన బరువు తగ్గేందుకు ఎక్కువగా సహాయపడతాయి. సబ్జా గింజలు బరువు తగ్గేందుకు ఎలా సహాయపడతాయో తెలుసుకుందామా.
సబ్జా గింజలలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీర జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులోని శోథ నిరోధక లక్షణాలు.. ఉబకాయాన్ని నియంత్రిస్తాయి. అలాగే బరువు తగ్గడానికి సహాయపడతాయి. హై ఫైబర్ కంటెంట్ సబ్జా గింజలు. ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వలన ఎక్కువగా తినకుండా చేసి.. మితంగా తినేలాగా ప్రేరెపిస్తుంది. దీని ద్వారా బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు, కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడం ద్వారా ఫైబర్ సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి. అలాగే ఉబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కంటెంట్ జీర్ణక్రియను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ స్పైక్ ను నివారిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది.
నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా విత్తనాలు జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేస్తాయి. తినేటప్పుడు అనవసరమైన అతిగా తినకుండా ఆపుతాయి. అలాగే ఆకలిని తగ్గించడమే కాకుండా.. అవాంఛిత ఆకలి బాధలను నియంత్రిస్తాయి. ఇందులో తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ, సబ్జా విత్తనాలలో బరువు తగ్గడానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి వివిధ విటమిన్లు.. ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
బరువు తగ్గడానికి సబ్జా విత్తనాలను ఎలా తినాలి… సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. సబ్జా గింజలు ఎక్కువగా నీటిని గ్రహిస్తాయి. ఇది ఫైబర్ కంటెంట్‌ను పెంచడమే కాకుండా… జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. రెండు చెంచాల సబ్జా విత్తనాలను తీసుకొని వాటిని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 15-20 నిమిషాలు నానబెట్టండి. ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ సబ్జా గింజలను తీసుకొని రోజంతా సిప్ చేస్తూ ఉండండి.
Akhanda Movie: ‘అఖండ’ సినిమా నుంచి మరో సర్ఫ్రైజ్.. టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?