AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of tendli: ఏ కాలమైన దొరికే కూరగాయ దొండకాయ ఆరోగ్యానిస్తే.. ఆకులు అందాన్ని ఇస్తాయి తెలుసా..!

Health Benefits Of Tendli: మనం తినే కూరగాయల్లో అనేక రకాలున్నాయి. అయితే ఎక్కువగా సీజనల్ గా దొరికేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ కాలమైనా దొరికే కూరగాయ "దొండకాయ"...

Benefits Of tendli: ఏ కాలమైన దొరికే కూరగాయ దొండకాయ ఆరోగ్యానిస్తే.. ఆకులు అందాన్ని ఇస్తాయి తెలుసా..!
Dondakay
Surya Kala
|

Updated on: Jun 02, 2021 | 2:44 PM

Share

Health Benefits Of Tendli: మనం తినే కూరగాయల్లో అనేక రకాలున్నాయి. అయితే ఎక్కువగా సీజనల్ గా దొరికేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ కాలమైనా దొరికే కూరగాయ “దొండకాయ”.. ఈ దొండకాయ మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడడమే కాదు ఈ దొండకాయ ఆకులు పిందెలు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ దొండకాయని కూరగా చేసుకొని తినడమే కాదు.. చాలా మంది పచ్చివి కూడా తింటారు.. ఇలా పచ్చివి తింటే.. దొండకాయతో మంచి పోషక విలువకూడా లభిస్తాయి. దొండకాయలో మెదడు, నాడీ వ్యవస్థ పనిచేసే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. దొండకాయ తినడంతో మొదడు యొక్క జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. ఆయుర్వేదం ప్రకారం .. అలసట, పని ఒత్తిడి తగ్గించి మెదడు చురుకుగా ఆలోచించేలా చేసే గుణం దొండకాయలో ఉందట.. దొండకాయలో థయామిన్ అధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్ ను గ్లూకోజ్ గా మార్చి మన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ థయామిన్ మన శరీర జీవ క్రియ రేటును పెంచుతుంది.. దొండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి, అధికంగా ఉంటాయి.. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. తరచూ ఈ దొండకాయ తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. దొండకాయ ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి దొండకాయ తింటే రక్తంలో చక్కర శాతం తగ్గి షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. అధిక మొత్తంలో కాల్షియం ఉండి వయసు ఎముకల ధృడత్వానికి ఉపయోగపడుతుంది. పొటాషియం అధికంగా ఉండి గుండె ఆరోగ్యాని.. గుండె అన్నీ అవయవాలకు రక్త సరఫరా.. సరిగా చేసేలా చెయ్యడమే కాదు.. గుండె నొప్పి రాకుండా కాపాడుతుందట.. తరచూ దొండకాయ తింటే చిన్న చిన్న రోగాలు దరి చేరకుండా చేస్తుంది.. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి1 లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.. దొండకాయలో అధిక మొత్తంలో ఐరన్ ఉండడంతో గర్భణీ స్త్రీలకు మంచి పోషకాహారం.. పచ్చి దొండకాయ తింటే చర్మం అందంగా మారుతుందని, స్కిన్ ఎలర్జీ వంటివి దరిచేరవని చెబుతున్నారు. గజ్జి లాంటి చర్మ వ్యాధులకు దొండకాయ ఆకులను పేస్ట్ లా చేసి చర్మం పై పూతగా వేసుకొంటే .. గజ్జి తగ్గుతుందని నిపుణులు తెలిపారు.

Also Read: ఏపీలోని ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం .. ఈ గవ్వల ఏ స్థానంలో ఉంటే ధనానికి లోటు ఉండదో తెలుసా..!