AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్.. కెరీర్‏లోని చెదు ఘటనను గుర్తుచేసుకున్న జరీన్ ఖాన్..

గతంలో సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్.. మీటూ ఉద్యమాలు మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్.. కెరీర్‏లోని చెదు ఘటనను గుర్తుచేసుకున్న జరీన్ ఖాన్..
Zareen Khan
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2021 | 10:48 PM

Share

గతంలో సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్.. మీటూ ఉద్యమాలు మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు సర్వ సాధారణమని చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. అలాగే మరికొందరు హీరోయిన్లు దర్శక నిర్మాతలు.. నటుల పేర్లను బయటపెట్టారు. అయితే ఇటు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా వివాదం పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవంపై స్పందించారు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ చేదు ఘటనను వెల్లడించింది.

బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం తిరిగుతున్న సమయంలో ఇండస్ట్రీలో ఓ వ్యక్తితో పరిచయం జరిగింది. జీవితంలో అతడి కంటే గొప్ప వ్యక్తి లేడని బిల్డప్ ఇచ్చేవాడు. తాను నటించే ఓ చిత్రంలో కిస్సింగ్ సీన్ లో నటించాల్సి ఉందని.. దాని కోసం రిహార్సల్ చేయాలని పిలిచాడు. కిస్సింగ్ సీన్ రిహాల్స్ పేరుతో నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మనసులోని భయాలను పక్కన పెట్టు అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు అంటూ జరీన్ ఖాన్ తెలిపింది. తన దారిలోకి మలుచుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడని.. ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా క్లోజ్ గా ఉండాలని.. ఆఫర్ల విషయాలను తను చూసుకుంటాను అంటూ మిస్ బీహేవ్ చేశాడని జరీన్ ఖాన్ తెలిపింది. అయితే ఇండస్ట్రీకి కొత్త కావడంతో తనకు తాను నాకు సర్దిచెప్పుకొన్నానని.. ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా ఇష్టం లేదని జరీన్ ఖాన్ తెలిపింది. కాల్ సెంటర్ లో పనిచేస్తూ.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే దానిని అని తెలిపింది. జరీన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ సరసన వీర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘హౌస్ ఫుల్ 2’ ‘హేట్ స్టోరీ 3’ ‘అక్సర్ 2’ ‘1921’ ‘హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ సినిమాలో కీలక పాత్ర పోషించింది.

Also Read: Akhanda Movie: ‘అఖండ’ సినిమా నుంచి మరో సర్‏ఫ్రైజ్.. టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్‏లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..