AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish Leaves Curry : ముల్లంగిని కూరగా చేసుకుని ఆకుని పడేస్తున్నారా..! ఆకుతో రుచికరమైన కూర తయారీ విధానం చూసేద్దాం..!

ముల్లంగి తో పచ్చడి, సాంబార్, మూలీ పరాఠా, కూర, సలాడ్స్ లో చేస్తుంటారు. అయితే ముల్లంగి దుంపలపైనా ఉన్న ఆకులు పడేస్తుంటారు.. అయితే వాటిలో..

Radish Leaves Curry : ముల్లంగిని కూరగా చేసుకుని ఆకుని పడేస్తున్నారా..! ఆకుతో రుచికరమైన కూర తయారీ విధానం చూసేద్దాం..!
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 1:10 PM

Share

Radish Leaves Curry : ప్రకృతికి మనిషికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అందుకనే ప్రకృతిలో లభించే ప్రతిదీ ముఖ్యంగా తినే ఆహారపదార్ధాల్లో ఎక్కువగ ఆరోగాయన్ని పెంపొందిస్తాయి. అందుకనే ఆరోగ్యంగా జీవించాలంటే ప్రకృతి ప్రసాదిత కూరగాలను పండ్లను ఎక్కువగా తినాలని అంటారు. రోగాల బారి నుంచి కాపాడే ఆహారాల్లో ముల్లంగి కూడా ప్రత్యేకమైంది. అందుకనే ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే ఆహారాల్లో ముల్లంగి కూడా ప్రముఖ స్థానం పొందింది.

ఎప్పుడైనా జలుగు, దగ్గు మీ దరిచేరినపుడు ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే జలుబు నుండి తొందరగా బయటపడవచ్చు. ఇక ఫైల్స్ తో బాధపడేవారికి ముల్లంగి రసం దివ్య ఔషధం అని అంటారు.. అయితే ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో ఈ ముల్లంగిని బంగాళ దుంపతో సమానంగా కూరగా చేసుకుంటారు.. మన ప్రాంతాల్లో ముల్లంగి తో పచ్చడి, సాంబార్, మూలీ పరాఠా, కూర, సలాడ్స్ లో చేస్తుంటారు. అయితే ముల్లంగి దుంపలపైనా ఉన్న ఆకులు పడేస్తుంటారు.. అయితే వాటిలో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రుచికరమైన కూరను తయారు చేసుకోవచ్చు.. ఈరోజు ముల్లంగి ఆకులతో కూరను చేసుకునే విధానం చూద్దాం..!

ముల్లంగి ఆకు పులుసుకు కావాల్సిన పదార్ధాలు : ముల్లంగి ఆకులు టమాటాలు ఉల్లిపాయలు (ముక్కలు) పచ్చిమిర్చి (4 నుంచి 8) ఎండు కొబ్బరి లేదా పచ్చికొబ్బరి అల్లంవెల్లుల్లి పేస్ట్ రుచికి ధనియాల పొడి చింతపండు గుజ్జు రుచికి సరిపడా ఉప్పు వేపినవేరుశెనగగుళ్లు పొడి

తయారు చేసే విధానం :

ముందుగా కుక్కర్ లో ముల్లంగి ఆకులు, ఒక టమాటా, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.

అనంతరం దీనిని మరో గిన్నెలోకి తీసుకుని మెదపాలి.. అనంతరం గ్యాస్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేసి వేయించి అనంతరం అందులో ఉడికించి రెడీ చేసుకున్న ముల్లంగి ఆకుల పేస్ట్ ను వేసి దోరగా వేయించాలి. వేగుపట్టిన తర్వాత చింతపండురసం పసుపు కారం ఉప్పువేసి మరగపెట్టాలి. అందులో రెండు స్పూన్స్ వేపినవేరుశెనగగుళ్లు పొడి, కొబ్బరి పొడి వేసి మరగ బెట్టి దింపెయ్యాలి. అనంతరం వేరే గిన్నె తీసుకుని ఎండు మిర్చి, ఆవాలు, వెల్లులి, కర్వేపాకు వేసి పోపు వేసుకుంటే రుచికరమైన ముల్లంగి ఆకుల పులుసు రెడీ

ఇది అన్నంలోకి.. ఒడిశా వైపు ఐతే రోటీ లోకి బాగుంటుంది.

గమనిక : పచ్చిమిర్చి పులుపు కొంచెం ఎక్కువవేయాలి..  పులుసు చిక్కగా ఉండాలి . కొత్తిమీర వెయ్యగుడదు ..కొంతమంది నువ్వుల పొడి కూడా వేసుకుంటారు.