AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blueberries Benefits : బ్లూ బెర్రీలు ఎన్నో పోషకాలకు నిలయం.. దీని జ్యూస్ వృద్ధులకు ఓ వరం..

బ్లూబెర్రీ చెట్టు అన్ని ఋతువులలో సంవత్సరం పొడవునా పుష్పిస్తూ ఉంటుంది. వీటి జన్మ స్థలం ఉత్తర అమెరికా.. నేడు వీటిని కెనడా, ఐరోపా, ఆసియా ఖండాల్లో సాగు చేస్తున్నారు. ఈ బ్లూ బెర్రీ...

Blueberries Benefits : బ్లూ బెర్రీలు ఎన్నో పోషకాలకు నిలయం.. దీని జ్యూస్ వృద్ధులకు ఓ వరం..
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 11:23 AM

Share

Blueberries Benefits : బ్లూబెర్రీ చెట్టు అన్ని ఋతువులలో సంవత్సరం పొడవునా పుష్పిస్తూ ఉంటుంది. వీటి జన్మ స్థలం ఉత్తర అమెరికా.. నేడు వీటిని కెనడా, ఐరోపా, ఆసియా ఖండాల్లో సాగు చేస్తున్నారు. ఈ బ్లూ బెర్రీ ల జాతికి క్రాన్ బెర్రీలు, బిల్ బెర్రీలుకూడా చెందుతాయి.1930వ సంవత్సరం తర్వాత యూరప్ లో అడుగు పెట్టిన బ్లూబెర్రీ ఇప్పుడు అక్కడ ప్రధాన వాణిజ్య పంటగా మారింది. పొద వలె పెరుగే ఈ బ్లూ బెర్రీ చెట్లను వ్యాపార పరంగా సాగుచేస్తున్నారు. వీటి కాయలు ముదురు నీలం రంగులో వుంటాయి. అయితే వీటిలో అనేక పోషకాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. ముఖ్యంగా బ్లూ బెర్రీలను తీసుకున్నవారికి జ్ఞాపకశక్తి మెండుగా పెరుగుతుందని చెప్పారు.

బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. బ్లూ బెర్రీస్‌, వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ ‘ఆక్సిడేటివ్‌ ఫైటో కెమికల్స్‌’, ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం అని, జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో, శాస్త్రజ్ఞులు వివరించారు. గతంలో, బ్లూ బెర్రీస్‌ మేసిన జంతువుల మీద జరిపిన పరిశోధనల ఆధారంగా, వయోజనులలో జ్ఞాపకశక్తి పెరగడానికి బ్లూ బెర్రీస్‌ తోడ్పడతాయని, ఇటీవల జరిపిన అధ్యయన కర్త, రాబర్ట్‌క్రికోరియన్‌ తెలియజేస్తున్నారు. ఆయన తమ సహాధ్యాయులతో సహా, ఎన్నో సంస్థల అండదండలతో, యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటీలో ఈ పరిశోధన నిర్వహించారు.

70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల మీద బ్లూబెర్రీస్‌ జ్యూస్‌ ప్రభావం గురించి, క్రికోరియన్‌, ఆయన బృందం, అసంఖ్యాకమైన పరీక్షలు జరిపారు. అధ్యయన కాలంలో, ఈ స్టడీగ్రూప్‌లోని వృద్ధులు, 2 నుంచి 2 1/2 కప్పుల బ్లూ బెర్రీ రసం సేవించారు. ‘కంట్రోల్‌ గ్రూప్‌’గా రూపొందిన మరో బృందం, రెండు నెలల పాటు, రోజూ, మరొక ‘పానీయం’ సేవించారు. కానీ, ‘బ్లూ బెర్రీ జ్యూస్‌’ తీసుకున్న వయో వృద్ధులలో, జ్ఞాపకశక్తి బాగా పెరిగింది. ఈ ప్రయోగాల ఫలితాలు ఎంతో, ఆశా జనకంగా వుండడంతో, ‘న్యూరో డిజెనరేషన్‌’ నిరోధించడానికి, బ్లూ బెర్రీస్‌ ఎంతగానో ఉపకరిస్తాయనే నిర్ణయానికి వచ్చాంఅన్నారు. రాబర్ట్‌ క్రికోరియన్‌. బ్లూ బెర్రీస్ – వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు , అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంమరియు పీచు పదార్థము ఉన్నాయి .

బ్లూ బెర్రీ లో ఉండే పోషకాలు -: 100 గ్రాముల బ్లూబెర్రీ కాయల్లో కార్పోహైడ్రేట్లు 14.5 గ్రా, ఫైబర్ 2.4 గ్రా, ఫేట్ 0.3 గ్రా, ప్రొటీన్ 0.7 గ్రా, విటమిన్ ఎ 54 ఐ.యు, లుటిన్ మరియు క్సెన్థిన్ 80 మైక్రో గ్రా, బి1 0.04 మి.గ్రా, బి2 0.04 మి.గ్రా, నియాసిన్ 0.42 మి.గ్రా, బి5 0.1 మి.గ్రా, బి6 0.1 మి.గ్రా, ఫోలేట్ 6 మైక్రో గ్రా, విటమిన్ సి 10 మి.గ్రా, విటమిన్ ఇ 0.6 మి.గ్రా, విటమిన్ కె 19 మైక్రో గ్రా, కేల్షియం 6 మి.గ్రా, ఐరన్ 0.3 మి.గ్రా, మెగ్నిషియం 6 మి.గ్రా, మాంగనీస్ 0.3 మి.గ్రా, ఫాస్పరస్ 12 మి.గ్రా, పొటాషియం 77 మి.గ్రా, జింక్ 0.2 మి.గ్రా ఉంటాయి.

కనుక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. ప్రకృతి ప్రసాదించిన పండ్లను తిందాం.. ఆరోగ్యంగా ఉందాం..

Also Read:

తిరుపతి క్షేత్రం వెయ్యేళ్ళ చరిత్రకు సాక్షి.. చిన్న లోపంతో పూజకు నోచుకోని గోవిందరాజస్వామి విగ్రహ కథ తెలుసా..!

దీపకు ఘోర అవమానం.. అమ్మ , నాన్నా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అంటూ చాయిస్ పిల్లలకే ఇచ్చేసింది

Follow Us