AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలంతే..! 30 నిమిషాల్లో ముదురు మటన్ కర్రీ.. ముక్క మెత్తగా త్వరగా ఉడకాలంటే..

మటన్‌ను నాన్‌వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు.. కర్రీ, ఫ్రై ఇలా ఎన్నో రకాలుగా వండుకుంటారు.. అయితే.. ముదురు మటన్ కర్రీని తక్కువ సమయంలో వండుకోవడం కష్టమవుతుంది.. అయితే.. కొన్ని పద్దతులు పాటించడం ద్వారా.. మటన్ కర్రీని రుచికరంగా, అరగంటలో తయారుచేసుకోవచ్చు.. మటన్ పీసెస్ త్వరగా ఉడకబెట్టడం ఎలాగో ఇందులో తెలుసుకోండి..

నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలంతే..! 30 నిమిషాల్లో ముదురు మటన్ కర్రీ.. ముక్క మెత్తగా త్వరగా ఉడకాలంటే..
Mutton Curry Recipe
Shaik Madar Saheb
|

Updated on: Apr 22, 2026 | 10:21 AM

Share

నాన్‌వెజ్ ప్రియులు.. మటన్‌ (మేక మాంసం) ను ఇష్టంగా తింటారు. మంచిగా మటన్ కర్రీ.. ఫ్రై.. ఇలా చాలా రెసిపీలను మసాలా దినుసులతో అద్భుతంగా చేసుకుంటారు.. వంటలో ఒక్కొక్కరిదీ.. ఒక్కో స్టైల్.. అయితే.. మాంసం లేతగా ఉంటే.. మటన్ కర్రీ తొందరగా అవుతుంది.. అదే ముదురుగా ఉంటే.. వంట చాలా కష్టమవుతుంది.. చాలా లేట్ ప్రాసెస్ తో కర్రీ అవుతుంది.. అయితే.. కొన్ని పద్దతులు పాటిస్తే.. ముదురు మటన్ అయినా.. నిమిషాల్లోనే ఉడుకుతుందని పేర్కొంటున్నారు వంట నిపుణులు..

మటన్ కర్రీని తక్కువ సమయంలో, సులభంగా.. రుచికరంగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

ముందుగా మటన్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ మటన్ ముక్కలను తీసుకుని, వాటికి మసాలా పట్టించాలి. మటన్ క్వాంటిటీ.. రుచికి సరిపోయేంతా.. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎండుమిర్చి పొడి (కారం), ధనియాల పొడి.. నూనెను మటన్ ముక్కలకు చేర్చాలి. ఈ పదార్థాలన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టేలా పూర్తిగా కలుపుకోవాలి. మసాలాలు మటన్‌కు బాగా పట్టిన తర్వాత, ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇది మటన్ రుచిని పెంచుతుంది.. మసాలాలు లోపలి వరకు వెళ్లేలా చేస్తుంది.

తరువాత, వంటకు సరిపోయేంత గిన్నె తీసుకుని దానిలో నూనె వేయాలి. నూనె వేడయ్యాక, ఉల్లిపాయలు, పసుపు, కొద్దిగా కరివేపాకు, 3-4 చీల్చిన పచ్చిమిరపకాయలను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత, ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను ఈ పాత్రలో వేసి, ఉల్లిపాయల మిశ్రమంతో బాగా కలపాలి.

ఇక్కడ ఒక ముఖ్యమైన పద్ధతిని పాటిస్తారు: “స్టీమ్ కుకింగ్”. మటన్ ఉన్న బేసిన్‌పై కొంత నీటిని నింపిన మరొక ఖాళీ బేసిన్‌ను ఉంచాలి. ఈ పద్ధతి వల్ల కర్రీలో ఉన్న మటన్ ముక్కల నుండి నీరు బయటికి వచ్చి, ఆ ఆవిరి సహాయంతో మటన్ చాలా త్వరగా, బాగా ఉడుకుతుంది. పైన ఉన్న నీరు కూడా వేడెక్కుతుంది, దానిని తరువాత ఉపయోగించుకోవచ్చు.

ఈ సమయంలో, కర్రీలో రెండు టొమాటోలు, ఉప్పును కలపాలి. ఉప్పు కలపడం వల్ల మటన్ ముక్కలు ఇంకా బాగా ఉడుకుతాయి. టొమాటోలు వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపి, వేడి నీటి పాత్రను మటన్ బేసిన్‌పై మళ్ళీ ఉంచాలి. మటన్ ముక్కల నుండి నీరు బయటికి వచ్చి, దాదాపు 80% ఉడికినట్లు గమనించవచ్చు. ఈ క్రమంలోనే.. బేసిన్ పై ఉంచిన వేడి నీరు మటన్ లో వేసుకోవాలి.. ఇది మటన్‌ను మరింత త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది.. రుచిని కూడా పెంచుతుంది.

మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాను కర్రీలో కలపాలి. చివరగా, కొత్తిమీర వేసి బాగా కలిపి, మంట ఆపివేయాలి. ఈ పద్ధతి ద్వారా తయారుచేసిన మటన్ కర్రీ చాలా రుచికరంగా, తక్కువ సమయంలో సిద్ధమవుతుంది.

బొప్పాయితో.. మటన్ కర్రీ మరో పద్దతి..

మటన్ కూర త్వరగా, మెత్తగా ఉడకాలంటే, వండటానికి కనీసం ఒక గంట ముందు పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం లేదా పచ్చి బొప్పాయి ముక్కలతో మ్యారినేట్ చేయడం కూడా మంచిదే.. ఇది ప్రెజర్ కుక్కర్ వాడటం, వండేటప్పుడు చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీరు పోయడం వల్ల ముదురు మాంసం కూడా 30-40 నిమిషాల్లో మెత్తగా ఉడుకుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us