AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాగిజావ తాగుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

డయాబెటిస్ ఉన్న వారికి కూడా రాగిజావ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. రాగి కాల్షియంతో సంపన్నమైనది, ఇది ఎముకల బలానికి చాలా అవసరం. ఉదయాన్నే తీసుకుంటే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకలను కూడా బలపరుస్తుంది. రాగిలో ప్రోటీన్ ఉండటం వల్ల కణాల పునరుద్ధరణకు మరియు శరీర నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. అయితే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.. అవేంటంటే..

రాగిజావ తాగుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Ragi Java
Jyothi Gadda
|

Updated on: Jun 14, 2025 | 8:31 PM

Share

రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి పోషకాలను కలిగి ఉంటుంది. రాగిజావలో కార్బోహైడ్రేట్లతో సమృద్ధిగా ఉండి, శరీరానికి శక్తిని తక్షణమే అందిస్తుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే దీని శక్తివంతమైన గుణాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. రాగి జావలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది మరియు కడుపు సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. రాగి లోపల ఉన్న ఫైబర్ ఎక్కువకాలం నిండిన భావన కలిగిస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రాగిలో ఉండే పోషకాలు, ముఖ్యంగా కాల్షియం మరియు ఐరన్, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది చర్మానికి తేమను అందించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాగి లోపల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి కూడా రాగిజావ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. రాగి కాల్షియంతో సంపన్నమైనది, ఇది ఎముకల బలానికి చాలా అవసరం. ఉదయాన్నే తీసుకుంటే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకలను కూడా బలపరుస్తుంది. రాగిలో ప్రోటీన్ ఉండటం వల్ల కణాల పునరుద్ధరణకు మరియు శరీర నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.

ప్రతిరోజూ రాగిజావను తీసుకోవచ్చు. అయితే దీనికంటూ ఓ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి.ఎప్పుడుపడితే అప్పుడు తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిది. కానీ రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇక మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావకు దూరంగా ఉంటే మంచిది. బరువు పెరగాలనుకునేవారు రాగి జావను ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెంగా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగజావ వినియోగంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాగి జావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది. కొందరికి దీని వల్ల కొందరిలో అలర్జీ వంటివి కూడా రావొచ్చు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు తినకపోవటం మంచిది. రాగిలో థైరాయిడ్ గ్రంథి యొక్క సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్‌లతో నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.