AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తితోపాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు..

ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవాల్సిందే. అలాగే మనం

ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తితోపాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు..
Healthy Food
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2021 | 10:16 AM

Share

ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవాల్సిందే. అలాగే మనం రోజూ పీల్చుకునే గాలి కలుషితమైనదే. అందుకే శరీరంలో ఆక్సిజన్ స్తాయిలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సులభంగా కరోనా మనకు సోకే ప్రమాదం ఎక్కువే ఉంది. ప్రస్తుత డిటిటల్ కాలంలో పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ ఆరోగ్యాన్ని ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి. అలాగే కలుషితమైన గాలిని పీల్చుకోవడం వలన తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా ఎదుర్కోనేందుకు కూడా రోగనిరోధక శక్తితోపాటు.. శరీరంలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువ ఉండడం కూడా అవసరమే. అయితే వీటినిపెంచుకోవడం కోసం సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనకు రోజూ దొరికే ఆహార పదార్థాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరీ ఆ ఆహరా పదార్థాలు ఎంటో తెలుసుకుందాం.

ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడానికి అవసరమయ్యే ఫుడ్..

1. అరటిపండు. ఇందులో ఆల్కలీన్ (ఆల్కలీన్ వాటర్) అధికంగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి సహాపడుతుంది. ఫైబర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అరటితో ఆరోగ్యంగా ఉంటారు.

2. కివి.. కివిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కివి రక్త కణాలకు ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రక్తాన్ని పెంపోందించడంలో సహయపడుతుంది.

విటమిన్ సీ లోపాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు..

1. నిమ్మకాయ: విటమిన్ సి నిమ్మకాయలో పుష్కలంగా ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఆక్సిజన్ పెంచడానికి నిమ్మకాయ పనిచేస్తుంది.

2. వెల్లుల్లి: ఆహార రుచిని పెంచడంతో పాటు వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆక్సిజన్ పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఆల్కలీన్ అధికంగా ఉంటుంది.

3. దోసకాయ: దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తినడం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవచ్చు. అలాగే దోసకాయలు ఆరోగ్యానికి మంచివి.

4. చిలగడదుంప చిలగడదుంపలో ప్రోటీన్స్ తోపాటు పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. చిలగడదుంపను తీపి బంగాళాదుంప అని కూడా అంటారు. దీన్ని తీసుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు.

5. క్యారెట్: క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యారెట్లను తీసుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు. క్యారెట్లను కూరగాయలు లేదా సలాడ్‏గా చేసుకోని తినవచ్చు.

6. మొలకెత్తిన ధాన్యాలు: మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో ఆక్సిజన్ మొత్తాన్ని పెంచడానికి ఇవి పనిచేస్తాయి. మొలకెత్తిన విత్తనాలు గ్రామ్, కాయధాన్యాలు, మూంగ్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

7. పెరుగు: పెరుగులో విటమిన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా లేకుండా చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

Also Read: HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..