Genuine Ghee: దేశీ నెయ్యిలోని కల్తీని ఇలా ఈజీగా గుర్తించండి.. రైతులు నిజమైన నెయ్యిని ఎలా గుర్తిస్తారో తెలుసా..

మీ నెయ్యిలో డాల్డా ఉందా ? లేదా...! సరే కనీసం బొక్కలను మరిగించి తీసిన నూనె అయినా ఉందా ? నెయ్యిలో డాల్డా, పామాయిల్ ఏంటని తెగ ఆలోచించ్చొద్దు ! మీరు చదవింది కరెక్టే.. ! ఇదేదో టూత్ పేస్ట్ టైపు యాడ్‌ కాదు..! మీ ఇంట్లోని చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నెయ్యిపై మాఫియా కన్ను పడింది. వారు చేస్తున్న ఫ్రాడ్‌..! స్వచ్ఛమైన నెయ్యిని .. కాలకూట విషంలా మార్చేస్తున్నారు. పామాయిల్, ఆయిల్‌ మిక్స్‌ చేసి కృత్రిమ నెయ్యిని తయారు చేస్తున్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇంతకీ మీరు కూడా ఇలాంటి కల్తీ నెయ్యినే తింటున్నారా? అసలు నెయ్యిలో కల్తీని గుర్తించడం ఎలా ?

Genuine Ghee: దేశీ నెయ్యిలోని కల్తీని ఇలా ఈజీగా గుర్తించండి.. రైతులు నిజమైన నెయ్యిని ఎలా గుర్తిస్తారో తెలుసా..
Genuine Ghee
Follow us
Sanjay Kasula

|

Updated on: May 30, 2023 | 5:55 PM

మీ ఇంట్లోని చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నెయ్యిపై మాఫియా కన్ను పడింది. వారు చేస్తున్న ఫ్రాడ్‌..! స్వచ్ఛమైన నెయ్యిని .. కాలకూట విషంలా మార్చేస్తున్నారు. పామాయిల్, ఆయిల్‌ మిక్స్‌ చేసి కృత్రిమ నెయ్యిని తయారు చేస్తున్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇంతకీ మీరు కూడా ఇలాంటి కల్తీ నెయ్యినే తింటున్నారా? అసలు నెయ్యిలో కల్తీని గుర్తించడం ఎలా ? ప్రస్తుతం మార్కెట్‌లో నిజమైన దేశీ నెయ్యి పేరుతో కల్తీ నెయ్యిని మాత్రమే మనకు తినిపిస్తున్నారు. అందులో ఒక్కోసారి డాల్డా, మరికొన్ని సార్లు పామాయిల్, ఇప్పుడు దేశీ నెయ్యిలో కొబ్బరినూనె కలిపి విక్రయిస్తున్నారు అక్రమార్కులు. వాస్తవానికి, కొబ్బరి నూనె తీపిగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు అది నెయ్యిలా సులభంగా ఘనీభవిస్తుంది.

అందుకే కొబ్బరినూనెలో దేశీ నెయ్యి కలిపి కల్తీ వ్యాపారులు విక్రయిస్తున్నారు. అసలు దేశీ నెయ్యిని ఎలా గుర్తించగలం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కాబట్టి రైతులు నిజమైన దేశీ నెయ్యిని ఎలా గుర్తిస్తారో ఈరోజు మీకు తెలుసుకుందాం. వాస్తవానికి, రైతులు మొదటి నుంచి స్వచ్ఛమైన దేశీ నెయ్యిని తయారు చేసుకుని తమ కుటుంబ సభ్యులతో అందిస్తుంటారు. అందుకే వారు తమ పద్ధతుల ద్వారా నిజమైన నెయ్యిని వెంటనే గుర్తిస్తారు. వారు అంత సులువుగా ఎలా గుర్తిస్తారో మనం తెలుసుకుందాం..

అసలు దేశీ నెయ్యి ఎలా ఉంటుంది?

నిజమైన దేశీ నెయ్యిని చూడటం ద్వారా అర్థం చేసుకోవచ్చు. దాని రంగు కొద్దిగా పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. నిజమైన నెయ్యి ఎప్పుడూ మృదువైన ఆకృతిలో రాదు. ఇది చాలా రవ్వ రవ్వలా ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ రవ్వ రవ్వ దాని బంగారు భాగంతో పోలిస్తే కొద్దిగా తెల్లగా ఉంటాయి. దీనితో పాటు, ఇది విభిన్నమైన సువాసనను కలిగి ఉంటుంది. అయితే, ఇప్పుడు కల్తీరాయుళ్లు అన్ని రకాల నెయ్యిని అనుకరించడం ప్రారంభించారు. నెయ్యి నిజమైనదిగా కనిపించేలా సువాసనలు మిక్స్ చేస్తున్నారు. దీనితో పాటు, ఈ ప్రిజర్వేటివ్‌ల వల్ల ఈ నకిలీ నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

నకిలీ నెయ్యిని ఎలా గుర్తించాలి

మీరు నకిలీ దేశీ నెయ్యిని సులభంగా గుర్తు పట్టగల అనేక మార్గాలను ఇవాళ మనం తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉండే దేశీ నెయ్యి నకిలీదని మీరు అనుకుంటే.. ముందుగా ఒక చెంచా నెయ్యి తీసుకుని.. దానిని మీ అరచేతిపై పోసుకోండి. అది కరిగిపోయేలా కాసేపు అలాగే ఉంచండి. ఆ నెయ్యి త్వరగా కరిగితే.. అది అసలైనదని అర్థం. అది కరగడానికి చాలా సమయం తీసుకుంటే.. అది కల్తీ చేయబడిందని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజమైన దేశీ నెయ్యి శరీర ఉష్ణోగ్రతతో కలిసిన వెంటనే కరగడానికి ఎక్కువ సమయం పట్టదు.

నెయ్యిలో కొబ్బరి నూనెను ఎలా గుర్తించాలి

దేశీ నెయ్యిలో కొబ్బరి నూనెను గుర్తించడం చాలా కష్టమైన పని. వాస్తవానికి కొబ్బరి నూనె దేశీ నెయ్యి వలె తెల్లగా మారుతుంది. కరిగినప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, నెయ్యి లోపల ఉన్న కొబ్బరి నూనెను గుర్తించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ పద్ధతిని డబుల్-బాయిలర్ పద్ధతి అంటారు. ఇందులో ముందుగా పాన్‌లో నీళ్లు పోసి, మరో గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన వెంటనే డబ్బాలో తీసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. కొబ్బరి నూనెను నెయ్యిలో కలిపితే, నెయ్యి, కొబ్బరి నూనె వేర్వేరు పొరలలో గడ్డకట్టడాన్ని మీరు చూడవచ్చు. ఇలా మాత్రమే మనం గుర్తించడానికి అవకాశం ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం