AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Shells Benefits: గుడ్డు పెంకులను పడేస్తున్నారా ? వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

సాధారణంగా గుడ్డు పోషకాహారం... ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజానాలు ఉంటాయన్న సంగతి తెలసిందే. రోజూ ఒక గుడ్డు తింటే.. శరీరానికి శక్తి రావడమే కాకుండా..

Egg Shells Benefits: గుడ్డు పెంకులను పడేస్తున్నారా ? వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Egg Shells
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2021 | 8:53 PM

Share

సాధారణంగా గుడ్డు  పోషకాహారం… ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజానాలు ఉంటాయన్న సంగతి తెలసిందే. రోజూ ఒక గుడ్డు తింటే.. శరీరానికి శక్తి రావడమే కాకుండా.. పోషకాలు అందుతాయిని అంటుంటారు. అయితే చాలా వరకు గుడ్డు పెంకులను తిసివేసి బయట పడెస్తుంటాం. కానీ గుడ్డుతోపాటు.. వాటి పెంకులలోనూ అనేక లాభాలున్నాయి. ఇవి కాల్షియం యొక్క గొప్ప మూలం. ఇది కాల్షియం కార్బొనేట్ రూపంలో లభిస్తుంది. అలగే బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, మాలిబ్డినం, సల్ఫర్, జింక్ మొదలైన ఇతర సూక్ష్మ మూలకాలను కూడా కలిగి ఉంటాయి. అందుకే గుడ్డు పెంకులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందామా.

1. గుడ్డు పెంకుల ఫేస్ ప్యాక్.. ఒక గిన్నెలో ఒక టీస్పూన్ గుడ్డు పెంకుల పౌడర్ తీసుకోవాలి. అందులో తేనె కలుపుతూ మెత్తటి పేస్ట్‏గా మార్చాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మొత్తానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ఉపయోగించినట్లుగా అనిపిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

2. ఎగ్ షెల్ హెయిర్ ప్యాక్.. మీ జుట్టు పొడవును బట్టి ఒక గిన్నెలో తగినంత పరిమాణంలో గుడ్డు పెంకుల పౌడర్ తీసుకోవాలి. అందులో పెరుగు వేసి పేస్ట్‏లా చేయాలి. ఆ తర్వాత దానిని జుట్టు మొత్తం అప్లై చేసి.. అలా 15 నిమిషాలు ఉండనివ్వాలి. ఇలా చేయడం వలన జుట్టు మెరిస్తుంది.

3. కాల్షియం సప్లిమెంట్‏గా పనిచేస్తుంది… కాల్షియం సప్లిమెంట్ ట్యాబ్లె్ట్స్‏కు బదులుగా గుడ్డు పెంకుల పొడిని ఉపయోగిస్తారు. అర టీస్పూన్ ఎగ్ షెల్ పౌడర్‌లో 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మీ శరీర అవసరాన్ని బట్టి ఎగ్ షెల్ పౌడర్ తీసుకోవచ్చు. కాల్షియం పళ్ళు పెరగడానికి, బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

4. దంతాల కోసం.. గుడ్డు పెంకుల పొడిని టూత్‏పేస్ట్‏గా ఉపయోగిస్తే చాలా మంచిది. ఇందుకోసం ఒక టీస్పూన్ ఎగ్ షెల్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా కలిపాలి. అలాగే ఇందులో కొబ్బరి నూనె కలపాలి. దీనితో వారానికి ఒకసారి పళ్లు తోముకోవడం వలన దంతాలు బలంగా ఉండడమే కాకుండా.. తెల్లగా మెరుస్తాయి.

5. గుడ్డు పెంకుల ఎరువు.. నత్రజని, భాస్వరం లాగా మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం. దీని లోపం ఎదుగుదల తగ్గడానికి, ఆకులు వంకరగా, నల్లని మచ్చలకు దారితీస్తుంది. మొక్కలకు కాల్షియం ఇవ్వడానికి గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించవచ్చు. ఎగ్ షెల్ పొడిని ఎరువుగా ఉపయోగించడానికి నాటేటప్పుడు పాటింగ్ మిక్స్ చేయాలి.

Also Read: Joker Malware: ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి. లేదంటే మీ పని అంతే.

Viral Video: ప్రాణాల కోసం పక్షి పొరాటం.. ఆహారం కోసం తలపెడితే అసలుకే ఎసరొచ్చింది.. వీడియో చూస్తే మనస్సు చలించకమానదు..