AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnuts: మీకు ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. ఇది చెబుతోంది ఎవరో కాదు.

walnuts: మనిషి ఎంత కాలం జీవించాలనేది వారు తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆహారం తీసుకుంటూ..

Walnuts: మీకు ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. ఇది చెబుతోంది ఎవరో కాదు.
Health
Narender Vaitla
|

Updated on: Aug 24, 2021 | 9:23 PM

Share

Walnuts: మనిషి ఎంత కాలం జీవించాలనేది వారు తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామాం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఇలాంటి వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఓ ఆహార పదర్థాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా మీరు బతికే కాలం పెరుగుతుందట. ఇదేదో సరదగా చెబుతోన్న విషయం కాదు.. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మరీ దీన్ని చెబుతున్నారు. వాల్‌నట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా మీ జీవిత కాలం పెరుగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం చెబుతోంది.

Walnuts

వాల్‌నట్స్ ఆకస్మిక మరణాలు తగ్గిస్తుందని, జీవిత కాలాన్ని పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన శాస్ర్తవేత్త యాన్‌ పింగ్‌ లి మాట్లాడుతూ.. వాల్‌నట్స్‌ను మత ఆహారంలో భాగం చేసుకునే వారి ఆయుర్దాయం పెరుగుతుంది. శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు వాల్‌నట్స్‌ ద్వారా అందుతాయి. వారంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వాల్‌నట్‌లను తీసుకోవడం ద్వారా ఆకస్మిక మరణం వచ్చే ప్రమాదం 14 శాతం తగ్గుతుందని అధ్యాయనంలో తేలింది. వాల్‌నట్స్‌ ద్వారా గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదం 25 శాతం తగ్గి కనీస ఆయుర్దాయం 1.3 ఏళ్లు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే శాస్త్రవేత్తలు ఈ విషయాలను గాలి లెక్కలు వేసే చెప్పట్లేదు.. ఇందుకోసం వారు 67,014 మంది మహిళలు, 26,326 మంది పురుషులను పరిగణలోకి తీసుకున్నారు. 1986 నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన డేటాపై విశ్లేషణ చేసిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆహారంలో వాల్‌నట్స్‌ ఎక్కువగా తీసుకునే వారికి ఆకస్మిక మరణం, గుండె జబ్బులతో మరణించిన సందర్భాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

Also Read: Egg Shells Benefits: గుడ్డు పెంకులను పడేస్తున్నారా ? వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Joker Malware: ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి. లేదంటే మీ పని అంతే.

Viral Video: ప్రాణాల కోసం పక్షి పొరాటం.. ఆహారం కోసం తలపెడితే అసలుకే ఎసరొచ్చింది.. వీడియో చూస్తే మనస్సు చలించకమానదు..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్