AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mawa Malpua: కరకరలాడే రుచి, కమ్మని రబ్రీ కాంబినేషన్.. నోట్లో వేసుకుంటే కరిగిపోవాయే మావా మాల్పువా

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వెళ్తే ఈ మాల్పువాను రుచి చూడాల్సిందే. నెయ్యిలో వేయించి, పాకంలో ముంచిన మాల్పువాపై చిక్కని రబ్రీ వేసుకుని తింటే ఆ మజానే వేరు. తెలుగు రాష్ట్రాల భోజన ప్రియుల కోసం ఈ మాల్పూవా అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ 40 ఏళ్ల నాటి అద్భుత రుచి విశేషాలు ఇప్పుడు మీకోసం.

Mawa Malpua: కరకరలాడే రుచి, కమ్మని రబ్రీ కాంబినేషన్.. నోట్లో వేసుకుంటే కరిగిపోవాయే మావా మాల్పువా
Mawa Malpua Recipe
Bhavani
|

Updated on: Apr 17, 2026 | 4:35 PM

Share

మన తెలుగు రాష్ట్రాల్లో పూతరేకులు, కాకినాడ కాజా ఎలాగో.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి ‘మావా మాల్పువా’ అంత ప్రత్యేకం. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆహార పదార్థాలకు దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఇండోర్‌లోని ‘సరాఫా బజార్’ ఒక ఫుడ్ పారడైజ్‌లా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తర భారత్ పర్యటనకు వెళ్లే భోజన ప్రియులు ఇక్కడి వంటకాలను రుచి చూడకుండా వెనక్కి రారు. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ వంటకం అందుబాటులో ఉంది. ఉత్తరాదిన దశాబ్దాల కాలం నాటి అనేక పిండివంటల దుకాణాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందింది పరాగ్ గుప్తా గారి మావా మాల్పువా దుకాణం. ఈ మాల్పువా సువాసన అటుగా వెళ్లే ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.

కావలసిన పదార్థాలు:

మావా (కోవా): 100 గ్రాములు (చక్కెర లేనిది)

మైదా పిండి: 1 కప్పు

రవ్వ (సుజీ): 2 టేబుల్ స్పూన్లు

పాలు: 1 నుండి 1.5 కప్పులు (అవసరానికి తగినట్లు)

యాలకుల పొడి: 1 టీస్పూన్

పంచదార: 1.5 కప్పు (పాకం కోసం)

నీరు: 1 కప్పు

నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిపడా

కుంకుమపువ్వు: చిటికెడు (పాకంలో వేయడానికి)

డ్రై ఫ్రూట్స్: గార్నిష్ కోసం (బాదం, పిస్తా ముక్కలు)

తయారీ విధానం:

ముందుగా ఒక పాత్రలో మావా (కోవా)ను మెత్తగా తురుముకోవాలి. అందులో మైదా పిండి, రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాలను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా జారుడు పిండిలా (దోశ పిండి కంటే కొంచెం పల్చగా) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు నాననివ్వాలి.

మరోవైపు, ఒక పాత్రలో పంచదార  నీరు పోసి మరిగించాలి. ఇది తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, గులాబ్ జామూన్ పాకంలా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇందులో కుంకుమపువ్వు, కొద్దిగా యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి.

వెడల్పాటి పాన్ తీసుకుని అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, ఒక గరిటెడు పిండిని తీసుకుని నెమ్మదిగా పాన్ మధ్యలో వేయాలి (దోశలా తిప్పకూడదు, అదే ఆకారం తీసుకుంటుంది). రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి తీయాలి.

వేడి వేడిగా ఉన్న మాల్పువాలను వెంటనే సిద్ధంగా ఉన్న పంచదార పాకంలో వేయాలి. ఒక 2-3 నిమిషాల పాటు నానిన తర్వాత బయటకు తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.

 సర్వింగ్: పైన బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసి వడ్డించండి. ఒకవేళ వీలైతే దీనిపై కొంచెం రబ్రీ వేసి వడ్డిస్తే ఆ రుచి రెట్టింపు అవుతుంది.

ఎంతో రుచికరమైన, నోరూరించే మావా మాల్పువాలు సిద్ధం! పండగల సమయంలో ఈ స్వీట్‌ను ప్రయత్నించి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి.

Follow Us
కమ్మటి వాసన, నోరూరించే రుచి.. మావా మాల్పువా ఇలా తయారు చేయండి
కమ్మటి వాసన, నోరూరించే రుచి.. మావా మాల్పువా ఇలా తయారు చేయండి
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?