AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?

సాధారణంగా కొబ్బరికాయను రాయిపై పగడొగితే మన చేతు నొప్పెడుతుంది. అదే కొబ్బరి కాయను తలపై పగలకొటితే ఆ నొప్పి ఎలా ఉంటుందో ఊహించుకోండి. విళవిళ్లాడాల్సిందే కదూ.. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం నెత్తిపై టెంకాయపెట్టి పగులగొడుతున్న జానాలు చడీచప్పుడు లేకుండా కూర్చున్నారు. ఇదేదో సినిమాలో చూసిన సీన్‌లా అనిపిస్తుంది కదూ

Watch : ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
Telangana Village Coconut Breaking Ritual
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 4:33 PM

Share

తలపై కొబ్బరి కాయలు పగలగొట్టే సీన్ అనగానే అందరికీ అరుందతి సినిమా గుర్తోస్తుంది. ఆ సినిమాలో అరుందతి తలపై 100 కొబ్బరికాయలు కొట్టినా ఆమె కదలకుండా కూర్చుంటుంది. అటు ఇటులా అలాంటి ఆచారమే ఇక్కడో గ్రామంలో ఉంది. నెత్తిపై టెంకాయపెట్టి పగులగొడుతున్న ఇక్కడి జానాలు చడీచప్పుడు లేకుండా కూర్చుంటున్నారు. ఇంతకు వీళ్లు ఎందుకు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. దీని వెనక ఉన్న అంతర్యం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆలయం ముందు కూర్చొని నెత్తిపై కొబ్బరి కాయలు పెట్టి పూజారితో వాటిని పగలగొట్టించే ఆచారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో ఉంది. అనాదిగా వస్తున్న ఈ ఆచార సాంప్రదాయాలను అక్కడి అర్చకులు, భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో ఇప్పటికీ పాటిస్తూ భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. రజకుల ఆరాధ్య దైవం అయిన మడేలయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా హోమం, బలిహరణం తర్వాత ఈ ఆచారాన్ని గ్రామస్తులు నిర్వహించారు.

ఇక్కడ ఆచారం ప్రకారం.. బలిహరణం జరిగిన తర్వాత ఆలయం ముందు పురుషులను కూర్చుండబెట్టి వాళ్ల తలపై కొబ్బరి కాయలను పెడతారు, అలాగే మహిళను నిల్చోపెట్టి వారి చేతితో కొబ్బరి కొబ్బరికాయలను ఉంచుతారు. తర్వాత పూజారి వచ్చి తన చేతిలో ఉన్న కర్రతో కొబ్బరి కాయలను ఒక్క దెబ్బతో పగలగొడతారు. అలా పూజారి కొబ్బరికాయలను పగులగొడుతున్నప్పుడు ఆ భక్తులు ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కూర్చున్నారు.ఈ వేడుకలు చూడడానికి స్థానికులతో పాటు పక్క గ్రామాల ప్రజలు కూడా భారీగా వచ్చారు.

ఆచారం వెనక అంతర్యం ఏమిటి

సూర్యుడు చూడని నీటితో స్వామివారికి బలిస్తే అంతా మంచి జరుగుతుందని ఇక్కడ గ్రామస్తుల అపార నమ్మకం. అందుకే ప్రతి ఏడాది ఇక్కడ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా తలపై చేతి పైన ఉన్న కొబ్బరికాయలు పగలగొట్టడం లాంటి సాంప్రదాయం ఈ గ్రామంలో మాత్రమే కనబడుతుంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?