AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్‌.. కట్‌చేస్తే..

ఈ మధ్య కాలంలో స్కూల్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌కు వరుస బాంబు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. కొందరు కేటుగాళ్లు పనిగట్టుకొని ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను, అధికారులను కంగారుపెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబ్‌ ఉందంటే ఓ ఫేక్ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్‌.. కట్‌చేస్తే..
Fake Bomb Threat Hyderabad
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 4:31 PM

Share

హైదరాబాద్‌లో ఒక్క ఫోన్ కాల్ భారీ కలకలం రేపింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందన్న సమాచారంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్‌తో అప్రమత్తమైన మెట్రో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపారు. స్టేషన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది అణువణువూ గాలింపు చేపట్టారు.

ఫ్లాట్‌ఫామ్‌లు, టికెట్ కౌంటర్లు, డస్ట్‌బిన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రయాణికుల సామాన్లు.. ఇలా అన్ని చోట్ల అనుమానాస్పద వస్తువుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను స్టేషన్ బయటకు పంపించగా, కొద్దిసేపు మెట్రో రైళ్లను కూడా నిలిపివేశారు. తనిఖీల అనంతరం స్టేషన్‌లో ఎలాంటి బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్ పూర్తిగా ఫేక్ అని పోలీసులు నిర్ధారించారు.

ప్రజల్లో భయం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు భావిస్తున్న పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
ఈ ఆచారం ఏందయ్యూ.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
ఈ ఆచారం ఏందయ్యూ.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?