AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Sweet: అద్భుతమైన రుచి ఈ వెజిటబుల్ స్వీట్స్ సొంతం.. క్షణాల్లో ఎలా తయారు చేసుకోవాలంటే..

"స్వీట్లను ఇష్టపడే" వ్యక్తులు సాధారణంగా మిఠాయిలు, బిస్కెట్లు, పేస్ట్రీలతో పాటు ఇతర తీపి పదార్థాలను ఇష్టపడతారు. పండగలు, శుభకార్యాలు ఇలా ఏ సందర్భంలోనైనా సరే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది స్వీట్స్ మాత్రమే. స్వీట్లను ఇష్టపడే వారి కోసం ఈ రోజు మూడు రకాల స్వీట్ల రెసిపీ గురించి తెలుసుకుందాం.. వీటిని చాలా మంది చూడగానే ముఖం చిట్లించే కూరగాయలతో తయారు చేస్తారు. అయితే ఈ స్వీట్లు రుచిలో అద్భుతంగా ఉంటాయి. దీంతో అందరూ ఇష్టంగా తింటారు.

Vegetable Sweet: అద్భుతమైన రుచి ఈ వెజిటబుల్ స్వీట్స్ సొంతం.. క్షణాల్లో ఎలా తయారు చేసుకోవాలంటే..
Vegetable Sweet
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 8:44 PM

Share

భారతీయ ఇళ్లలో స్వీట్లతోనే ఆనందం పంచుకుంటారు. అంతేకాదు చాలా మంది స్వీట్లు లేదా మసాలా దినుసులు లేకుండా ఆహారం కూడా తినరు. ఇప్పటికీ చాలా మంది ఆహారం తిన్న తర్వాత కొంచెం తీపి తింటారు. కొంతమంది బెల్లం మాత్రమే తింటారు. వివాహా విందులో కూడా.. ప్రధాన ఆహారపదార్ధాలతో పాటు కొంత డెజర్ట్ ఉంటుంది. లేకపోతేవివాహ విందు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. స్వీట్ లవర్స్ కు కొరత లేదు.. అయితే చాలా మంది మార్కెట్ లో లభించే స్వీట్లు కొంటారు. అయితే ఈ రోజు మనం ఇంట్లో సులభంగా తయారు చేసుకోగల.. అది కూడా కూరగాయలను ఉపయోగించి తయారు చేసే మూడు స్వీట్ల గురించి తెలుసుకుందాం.

ఇంట్లో భోజనం తర్వాత ఖచ్చితంగా స్వీట్లు తినే అలవాటు ఉన్నా.. లేదా ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో స్వీట్లు తయారు చేసుకోవాలనుకున్నా ఈ రోజు మేము చెబుతున్న రేసిపీలను ట్రై చేయండి. ఈ స్వీట్లను తయారు చేసి అతిధులకు లేదా ఇంట్లోవారికి అందిస్తే.. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రశంసిస్తూనే ఉంటారు.

బీట్‌రూట్ బర్ఫీ చాలా తక్కువ మంది మాత్రమే బీట్‌రూట్ తినడానికి ఇష్టపడతారు. ఇది పోషకాల నిధి. అయితే మీరు బీట్‌రూట్ బర్ఫీ చేస్తే.. అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీని కోసం.. ముందుగా బీట్‌రూట్‌ను కడిగి తొక్క తీసి తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. దానిలో బీట్ రూట్ తురుము వేసి దానికి పాలు, రెండు చెంచాల దేశీ నెయ్యి కలపండి. పాలు పూర్తిగా ఆవిరి అయ్యే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. కొద్దిగా పాలు మిగిలిపోయిన తర్వాత.. రుచికి సరిపడా చక్కెర జోడించండి. మధ్యలో కలుపుతూ ఉండండి. పాలు పూర్తిగా అయ్యి.. బీట్‌రూట్‌ మిశ్రమం దగ్గర పడిన తర్వాత.. యాలకుల పొడి, తరిగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలపండి. ఇప్పుడు ఒక ప్లేట్‌ను తీసుకుని దానికి నెయ్యి రాసి బీట్ రూట్ మిశ్రమాన్ని పేయండి. ఇది గట్టి పడిన తర్వాత కావాల్సిన షేప్ లో కట్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

సొరకాయ బర్ఫీ సొరకాయతో కూరలు, జ్యూస్ మాత్రమే కాదు సొరకాయ ఖీర్ నుంచి హల్వా వరకు ప్రతిదీ చాలా రుచికరంగా ఉంటుంది. మీరు దీనితో బర్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని బీట్‌రూట్ బర్ఫీ లాగానే తయారు చేయాలి. దీనికి కొంచెం తురిమిన కొబ్బరిని కలుపుకుంటే రుచి పెరుగుతుంది. పాలపొడిని కూడా జోడించవచ్చు. ఇది చాలా మంచి రుచిని ఇస్తుంది.

పర్వాల్ లేదా పొటల్స్ స్వీట్స్ పొటల్స్ వీటినే పర్వాల్ అని కూడా అంటారు. ఇవి వేసవికాలంలో మార్కెట్లో సులభంగా లభిస్తాయి. పర్వాల్‌లను కడిగి తొక్క తీసి.. విత్తనాలను తొలగించడానికి మధ్యలో కట్ చేయాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నీటిని వేడి చేసి.. కట్ చేసుకున్న పర్వాల్‌లను వేసి ఉడకబెట్టండి. ఒక్క ఉడుకు ఉడికించలి. దీని తర్వాత సమాన మొత్తంలో నీరు, చక్కెరతో వన్-స్ట్రింగ్ సిరప్ తయారు చేయండి. ఉడికించిన పర్వాల్‌లను ఈ సిరప్‌లో వేసి రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించి.. వాటిని సిరప్‌లో మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టండి. సిరప్ తయారుచేసేటప్పుడు.. ఆ సిరప్ లో కొంచెం గ్రీన్ కలర్ జోడించండి. ఇది మంచి రంగును ఇస్తుంది. ఇప్పుడు మావా తీసుకుని అందులో పిస్తాపప్పులు, జీడిపప్పు, బాదం కలపండి. సిరప్ నుంచి పర్వాల్‌లను తీసి కట్ చేసిన వాటిల్లో మావా మిశ్రమాన్ని నింపండి. అంతే పర్వాల్ కి మిఠాయి తినడానికి సిద్ధంగా అయినట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..