Vankaya Chutney: వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!

వంకాయ కాంబినేషన్‌తో ఎండు రొయ్యలు, ఎండు చేపలు వేసి కూడా వండుతూ ఉంటారు. ఈ కర్రీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు తయారు చేసే ఈ వెరైటీ చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎప్పుడైనా నోరు చప్పగా ఉంది అనుకున్నప్పుడు ఈ పచ్చడి చేసుకుని తినవచ్చు..

Vankaya Chutney: వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
Vankaya Chutney
Follow us
Chinni Enni

|

Updated on: Jan 16, 2025 | 7:16 PM

కూరగాయల్లో రారాజు వంకాయ అని చెబుతూ ఉంటారు. వంకాయతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. వంకాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది చట్నీలు, గుత్తివంకాయ కర్రీ చేసుకుంటారు. వంకాయ కాంబినేషన్‌తో ఎండు రొయ్యలు, ఎండు చేపలు వేసి కూడా వండుతూ ఉంటారు. ఈ కర్రీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు తయారు చేసే ఈ వెరైటీ చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎప్పుడైనా నోరు చప్పగా ఉంది అనుకున్నప్పుడు ఈ పచ్చడి చేసుకుని తినవచ్చు. ఒక్కసారి రుచి చూశారంటే వంకాయ కర్రీ కంటే.. ఈ పచ్చడే చేసుకుని తింటూ ఉంటారు. మరి ఈ వంకాయ తక్కాలి పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వంకాయ తక్కాలి పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఎండు మిర్చి, చింత పండు, తాళింపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్.

వంకాయ తక్కాలి పచ్చడి తయారీ విధానం:

ఈ పచ్చడి చేసుకునేందుకు ముందుగా తెల్ల వంకాయలను తీసుకోండి. ఇవి అయితే మరింత రుచిగా ఉంటాయి. వీటిని మీడియం సైజులో ముక్కలు కట్ చేయండి. ఈ ముక్కలు ఉప్పు వేసి నీటిలో వేయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయండి. తీసి మరో ప్లేట్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోనే వంకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. ఆ నెక్ట్స్ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింత పండు వేసి అన్నీ మగ్గేంత వరకు మిక్స్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కొన్ని వెలుల్లి రెబ్బలు కూడా వేయండి. కొద్దిగా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి. కావాలి అనుకుంటే రోట్లో వేసుకుని కూడా దంచుకోవచ్చు. ఇక ఈ పచ్చడికి తాళింపు పెట్టండి. తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసి.. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా.. భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే.. మళ్లీ మళ్లీ ఇలాగే తింటారు.