- Telugu News Photo Gallery Doing these things early in the morning will keep the kidneys healthy, Check Here is Details
Kidneys Health: ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
శరీరంలో కీలకంగా పని చేసే ముఖ్యమైన భాగాల్లో మూత్ర పిండాలు కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీల సమస్యలు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్‌లో మార్పులు రావాలి..
Updated on: Jan 16, 2025 | 4:57 PM

శరీరంలో ఉండే ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యమైన పనులు నిర్వర్తించడంలో కిడ్నీలు ఎంతో సహాయ పడతాయి. శరీరంలో ఉండే మలినాలు, వ్యర్థాలను బయటకు పంపుతాయి.

ఇలాంటి కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే ఉదయాన్నే కొన్ని రకాల పనులు చేయాలి. వీటి కారణంగా ఎన్నో సమస్యలను రాకుండా ఉంటాయి. మూత్ర పిండాలు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండి పని చేయాలంటే నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగితేనే కిడ్నీలు ఆరోగ్యంగా పని చేస్తాయి.

నీళ్లు ఎక్కువగా తిగితే కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉంటాయి. కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల అనేక సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, అరిగేందుకు సమయం పట్టే ఆహారాలను తక్కువగా తినడం మంచిది.

తినే ఆహారాల్లో ఉప్పును కూడా చాలా వరకు తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తింటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఆక్సలేట్ ఉండే ఆహారాలను కూడా తక్కువగా తినాలి. కిడ్నీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




