- Telugu News Photo Gallery Shaving every day? These things are for you, Check Here is Details in Telugu
Shaving: ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
కొన్ని రకాల ఉద్యోగాలు చేసేవారు ప్రతి రోజూ షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొంత మంది రోజూ గడ్డాన్ని షేవ్ చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే ఈ పనే మొదలు పెడతారు. ఇలా షేవింగ్ చేయవచ్చా? షేవింగ్ క్రీమ్ ప్రతి రోజూ ఉపయోగించవచ్చా ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 16, 2025 | 4:04 PM

ప్రతి రోజూ షేవింగ్ చేసుకోవడం కొంత మందికి ఉండే అలవాటు. రోజూ ఉదయం లేవగానే గడ్డం గీసుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే రోజుల తరబడి అలానే ఉంచుకుంటారు. కానీ ప్రతి రోజూ గడ్డం గీసుకోవచ్చా? షేవింగ్ క్రీమ్ వాడటం వల్ల ఏదన్నా హాని జరిగే అవకాశం ఉందా! ఇప్పుడు చూద్దాం.

గడ్డాన్ని ప్రతి రోజూ షేవింగ్ చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు. గడ్డాన్ని ప్రతిరోజూ క్లీన్ చేయడం వల్ల దుమ్ము, ధూళి అనేవి ముఖంపై పేరుకుపోకుండా ఉంటాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అదే గడ్డాన్ని అలానే ఉంచేయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గడ్డాన్ని ప్రతిరోజూ కడగాలి. ప్రతిరోజూ షేవింగ్ చేసుకునే అలవాటు ఉంటే.. సరైన షేవింగ్ క్రీమ్ ఎంచుకోవాలి. లేకుంటే చర్మ సమస్యలు రావచ్చు.

డైలీ షేవింగ్ చేసుకునే అలవాటు ఉంటే సరైన ట్రిమ్మర్ లేదా రేజర్ వాడాలి. అలాగే ప్రతిరోజూ షేవ్ చేసుకోకపోయినా.. వారానికి ఒకసారి అయినా షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మానికి మంచిది.

ప్రతిరోజూ షేవింగ్ చేయడం వల్ల చర్మం కూడా మంటగా ఉంటుంది. కాబట్టి చర్మ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి వారు మంచి షేవింగ్ క్రీమ్ ఎంచుకోవడం ఎంచుకోవాలి.




