అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి.. వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్ సమస్య. కాలేయంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్‌కు సకాలంలో చికిత్స అందకపోతే లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్ అనేది క్రమంగా పెరిగే సమస్య.. చాలా మంది ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలను విస్మరిస్తారు. దీనివల్ల వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యకు సకాలంలో వైద్యం అందడం లేదని, దీంతో ఇది తీవ్రమైనదిగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ల ప్రకారం.. ఈ లక్షణాల ద్వారా మీరు ఇంట్లోనే మీ ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..