మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ఈ నిపుణ యోగం కలిగినందువల్ల అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకుంటారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, ఆర్థిక లాభాలు పొందు తారు. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాఫారాల్లో ధన ప్రవాహానికి అవకాశం ఉంది. సుమారు పదిహేను రోజుల పాటు రాజ భోగాలు అనుభవిస్తారు. మీ సమర్థతకు, ప్రతిభకు, నైపుణ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.