చలికాలంలో మఖానా తినొచ్చా?

16 January 2025

TV9 Telugu

TV9 Telugu

తామర గింజలు.. ‘మఖానా’గా పిలుచుకునే ఈ గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి

TV9 Telugu

అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా.. తామర గింజలతో ఆరోగ్యానికి మేలే

TV9 Telugu

నిజానికి, మఖానా ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదు. మఖానా యాంటీ ఆక్సిడెంట్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన చిరుతిండి కూడా. దీన్ని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది

TV9 Telugu

మఖానాలో విటమిన్ ఎ, డి, కాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫ్యాట్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మఖానాలో క్యాలరీల శాతం తక్కువ. అందుకే బరువు పెరుగుతారనే భయం లేదు

TV9 Telugu

వింటర్ సీజన్‌లో మఖానా తినొచ్చో? లేదో? చాలా మందికి సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మఖానా స్వభావ రిత్యా వేడి తత్వం కలిగి ఉంటుంది

TV9 Telugu

చలికాలంలో రోజూ 30 గ్రాములు మఖానా తింటే శరీరం వెచ్చగా మారి, చలి నుంచి కాపాడుతుంది. అలాగే మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల పొట్ట చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. బరువు తగ్గడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పాలలో నానబెట్టిన మఖానా తింటే హాయిగా నిద్ర పడుతుంది. మఖానా తినడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

మఖానా తింటే ఎముకల సమస్యలు కూడా దరిచేరవు. మఖానా మంచి గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అందువల్ల మధుమేహ రోగులు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా దీనిని తినవచ్చు. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది