AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంతాల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ? ఆ పండ్లతో మీ దంతాలకు బలం !

మీ దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎర్రని అరటిపండు, ఆపిల్, ఆరెంజ్ వంటి పండ్లు దంతాలను శుభ్రం చేస్తాయి, బలాన్ని ఇస్తాయి. ఎర్రని అరటిపండు, మాగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలను కలిగి ఉండి దంతాలపై మలినాలను తొలగిస్తుంది. ఆపిల్‌లోని ఫైబర్, నీరు, మాలిక్ ఆమ్లం పళ్ళు శుభ్రం చేస్తాయి. ఆరెంజ్ లోని సీ విటమిన్, ఐరన్ దంతాలను బలపరుస్తాయి. అలాగే, ఉసిరికాయ, ఎండుద్రాక్ష వంటి ఆహారాలు కూడా దంతాలకు బలం అందిస్తాయి. ఈ పండ్లు, కూరగాయలు రోజూ తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

దంతాల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ? ఆ పండ్లతో మీ దంతాలకు బలం !
Red Banana Is Good For Strong Teeth
Prashanthi V
|

Updated on: Jan 16, 2025 | 6:00 PM

Share

మీ దంతాలను కాపాడుకోవడం అంటే ఒక్క బ్రష్ చేయడం కాదు దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడం కూడా ముఖ్యమే. మీరు తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చడం ద్వారా మీరు మీ దంతాలు ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా, కరకరలాడే పండ్లు, కూరగాయలు సహజంగా మీ దంతాలను శుభ్రపరుస్తాయి. పైగా మీ చిగుళ్ళను ఉత్తేజపరుస్తాయి. ఇంతకి ఇప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఎర్రని అరటిపండు (Red Banana)

దంతాల ఆరోగ్యానికి ఎర్రని అరటిపండు చాలా మంచిది. ఇందులో ఉండే మాగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు దంతాలపై ఉన్న మలినాలను తొలగించడంలో సహాయపడుతాయి. ఇవే కాకుండా ఈ ఎర్రని అరటి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ అరటిపండ్లలో ఉండే కాల్షియం దంతాలను బలంగా చేస్తుంది. దంతాలు బలహీనంగా లేదా ఊగిపోతే ఈ పండ్లను తినండి. రోజు ఈ పండును తినడం వల్ల నోటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రాత్రి ఈ పండును తినడం వల్ల దంతాల నుండి రక్తస్రావం, దంతాల పతనం లాంటి సమస్యలు ఉండవు. బేకింగ్ సోడా, అరటిపండు, కొబ్బరి నూనె కలిపి పేస్ట్ చేసి బ్రష్ చేస్తే దంతాలు పగిలిపోవడం, మచ్చలు రావడం మానుకుంటాయి.

ఆపిల్ లో ఫైబర్ తో దంతాలకు రక్షణ

ఆపిల్‌లో ఉన్న ఫైబర్, నీరు దంతాలను సురక్షితంగా ఉంచుతుంది. ఇది దంతాలపై ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది. ఈ ఆపిల్ నోట్లో దుర్వాసన తగ్గించి, నోటి కీటకాలను కూడా బయటపెట్టిస్తుంది. ఆపిల్‌లో ఉన్న మాలిక్ ఆమ్లం దంతాలను శుభ్రం చేస్తుంది.

దంతాలను బలపరచడానికి ఆరెంజ్

ఆరెంజ్ లో ఉన్న సీ విటమిన్, ఐరన్ దంతాలను శుభ్రపరచి బలం ఇస్తుంది. ఆరెంజ్ లోని మాలిక్ ఆమ్లం దంతాలపై ఉండే మచ్చలను తొలగించి, వాటిని శుభ్రంగా చేస్తుంది. ఆరెంజ్ లో ఉండే నీరు, ఫైబర్ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో కీటకాలు, దుర్వాసన తగ్గుతాయి. ఆరెంజ్ తినడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా శక్తిని కోల్పోతాయి. నోటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఎండుద్రాక్షతో దంతాలకు బలం

ఎండుద్రాక్షలు (డ్రై ఫ్రూట్స్) తినడం వల్ల కూడా దంతాలు బలంగా మారుతాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉసిరికాయ

ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సీ విటమిన్‌ దంతాలకు రక్షణను అందిస్తాయి. అలాగే ఉసిరికాయ దంతాలకు బలం ఇస్తుంది. ఉసిరికాయను రోజూ నమిలి తినడం వల్ల దంతాలు బలంగా మారుతాయి. లేదా ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి పుక్కిలించడం లేదా పేస్ట్ చేసి దంతాలకు మసాజ్ చేయడం కూడా మంచిది. పైన చెప్పిన చిట్కాలను పాటించి మీరు దంతాలను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోండి.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..