శీతకాలంలో చలిగాలులకి శరీరం నిస్తేజంగా మారడమే కాదు... వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. జలుబూ, దగ్గూ వంటివి తరచూ పలకరిస్తాయి. ఇలాంటప్పుడు ఒంట్లో ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే ఉసిరి తినాల్సిందే
TV9 Telugu
చలికి చర్మం, జుట్టు మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా మారతాయి. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి
TV9 Telugu
ఉసిరి ఈ కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్, జ్యూస్, మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు
TV9 Telugu
ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలోని పోషకాలు చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి
TV9 Telugu
ఉసిరిలో ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి. జబ్బులపై పోరాడే తెల్లరక్తకణాలని వృద్ధి చెందేట్టు చేస్తాయి
TV9 Telugu
అయితే ఉసిరిని తేనెతో కలిపి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉసిరితో కలిపి తేనె తింటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఉసిరి గుజ్జు చేసి, అందులో అర చెంచా తేనె కలుపుకుని రోజూ తినవచ్చు
TV9 Telugu
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరిరసంతో తేనె కలిపి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉసిరితో తేనె కలిపి తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు
TV9 Telugu
అయితే, ఇందు కోసం మీరు తేనెను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యం. ఉసిరికాయతో తేనె కలిపి తింటే గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది