Tirumala Vada Prasadam: తిరుమల వడ ప్రసాదం.. ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు!!
తిరుమల వడ ప్రసాదం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. వెంకటేశ్వర స్వామికి సమర్పించే నేవేథ్యాల్లో ఇది కూడా ఒకటి. ఈ వడ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వడ ప్రసాదాన్ని మనం కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏదైనా పండుగల సమయంలో స్వామి వారి ప్రసాదాన్ని చేసుకోవచ్చు. కానీ ఎంతైనా తిరుమల ప్రసాదం కదా.. అంత టేస్ట్ మన ఇంట్లో రాకపోవచ్చు. ఈ ప్రసాదం తయారు చేయడానికి సమయం ఎక్కువే పడుతుంది. ఈ వడ ప్రసాదాన్ని పొట్టు మినుములతో..

తిరుమల వడ ప్రసాదం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేథ్యాల్లో ఇది కూడా ఒకటి. ఈ వడ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వడ ప్రసాదాన్ని మనం కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏదైనా పండుగల సమయంలో స్వామి వారి ప్రసాదాన్ని తయారు చేసుకుని నివేదించుకోవచ్చు. కానీ ఎంతైనా తిరుమల ప్రసాదం కదా.. అంత టేస్ట్ మన ఇంట్లో రాకపోవచ్చు. ఈ ప్రసాదం తయారు చేయడానికి సమయం ఎక్కువే పడుతుంది. ఈ వడ ప్రసాదాన్ని పొట్టు మినుములతో చేస్తారు. ఈ వడ తింటే ఎంతో ఆరోగ్యం కూడా. ఎందుకంటే పొట్టు మినుముల్లో కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వడను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల వడకు కావాల్సిన పదార్థాలు:
పొట్టు మినుములు – అర కిలో, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – రెండు స్పూన్స్, ఉప్పు తగినంత, నూనె.
తిరుమల వడ తయారీ విధానం:
ముందుగా పొట్టు మినుములను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక లోతైన గిన్నెలో 8 గంటల పాటు నాన బెట్టాలి. వీటిని రాత్రికి నానబెట్టుకుంటే బెటర్. ఉదయం లేవగానే ప్రసాదం తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. 8 గంటలు నానిన పొట్టు మినుములను నీళ్లు వేయకుండా.. మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రోట్లో జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి కాస్త పొడిలా దంచుకోవాలి. ఈ పొడిని మినప పిండిలో కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకుని తడి వస్త్రంపై వేడి వడలాగా వత్తుకోవాలి. చేతులకు తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి.
ఇలా ఒత్తుకున్న తర్వాత వడలను వేడి వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి.. మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకూ వేయించుకోవాలి. ఈ వడలు ఉడకడానికి 12 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. వడలు వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే తిరుమల వడ ప్రసాదం సిద్ధం. ఇవి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇవి చక్కటి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ఈ తిరుమల వడ ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేసి చూడండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.