Munakkaya Fish Pulusu: మునక్కాయ చేపల పులుసు ఇలా చేస్తే.. సువాసన వీధుల్లోకి వచ్చేస్తుంది..

చేపల పులుసు అంటే నాన్ వెజ్ లవర్స్‌కి చాలా ఇష్టం. చేపలతో పులుసు చేసినా, ఫ్రై చేసినా చాలా రుచిగా ఉంటాయి. చేపల పులుసుతో మునక్కాయ కలిపి చేస్తే ఆహా ఆ రుచే వేరని చెప్పొచ్చు. మునక్కాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండూ కలిపి వండితే ఆ రుచి వీధుల్లోకి కూడా వెళ్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చిన వారికి ఒక్కసారి చేసి పెట్టారంటే.. మీ వంటకు దాసోహం అయిపోతారు. మునక్కాయ, చేపలు..

Munakkaya Fish Pulusu: మునక్కాయ చేపల పులుసు ఇలా చేస్తే.. సువాసన వీధుల్లోకి వచ్చేస్తుంది..
Munakkaya Fish Pulusu
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 07, 2024 | 10:20 PM

చేపల పులుసు అంటే నాన్ వెజ్ లవర్స్‌కి చాలా ఇష్టం. చేపలతో పులుసు చేసినా, ఫ్రై చేసినా చాలా రుచిగా ఉంటాయి. చేపల పులుసుతో మునక్కాయ కలిపి చేస్తే ఆహా ఆ రుచే వేరని చెప్పొచ్చు. మునక్కాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండూ కలిపి వండితే ఆ రుచి వీధుల్లోకి కూడా వెళ్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చిన వారికి ఒక్కసారి చేసి పెట్టారంటే.. మీ వంటకు దాసోహం అయిపోతారు. మునక్కాయ, చేపలు రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు వీటిల్లో లభిస్తాయి. మరి ఈ మునక్కాయ చేపలు పులుసు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మునక్కాయ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు:

మునక్కాయలు, చేపలు, పసుపు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి టమాటాలు, చింత పండు, గరం మసాలా, అల్లం తరుగు, వెల్లులి తరుగు, మెంతులు, కొబ్బరి తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్.

మునక్కాయ చేపల పులుసు తయారీ విధానం:

ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి చింత పండు, కారం, వెల్లుల్లి ముక్కలు, కొబ్బరి తురుము వేసి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చేపలు గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో మెంతులు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, అల్లం తరుగు, పచ్చి మిర్చి వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్టే వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇది బాగా ఉడికాక మునక్కాయ ముక్కలు వేసి ఉడికించాలి. ఇవి కూడా ఉడికాక కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత నీళ్లు పోయాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కలు, గరం మసాలా వేసి గరిటె పెట్టకుండా.. గిన్నెతో కదుపుతూ.. ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మునక్కాయ చేపల కూర సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. వండుతూ ఉంటేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది.