Meal Maker Masala: ఈ స్టైల్‌లో మీల్ మేకర్ మసాలా చేస్తే.. ముద్ద మిగల్చకుండా తినేస్తారు!
మీల్ మేకర్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటిని అందరూ తింటారు. వీటితో ఎన్నో రుచికరమైన వంటలను తయారు చేస్తారు. స్నేక్స్‌గా, బ్రేక్ ఫాస్ట్‌గా, పులావ్‌లో, రైస్‌లు ఏవి వండినా రుచి మాత్రం చాలా బావుంటుంది. చపాతీ, పుల్క, రోటీ వంటి వాటితో కూడా ఈ కర్రీ తింటే చాలా బావుంటుంది. మీల్ మీకర్స్‌తో తయారు చేసే వంటల్లో..
మీల్ మేకర్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటిని అందరూ తింటారు. వీటితో ఎన్నో రుచికరమైన వంటలను తయారు చేస్తారు. స్నేక్స్‌గా, బ్రేక్ ఫాస్ట్‌గా, పులావ్‌లో, రైస్‌లు ఏవి వండినా రుచి మాత్రం చాలా బావుంటుంది. చపాతీ, పుల్క, రోటీ వంటి వాటితో కూడా ఈ కర్రీ తింటే చాలా బావుంటుంది. మీల్ మీకర్స్‌తో తయారు చేసే వంటల్లో మీల్ మేకర్ మసాలా కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా, కమ్మగా ఉంటుంది. సులభంగా తయారు చేయవచ్చు. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు:
మీల్ మేకర్, ఉల్లిపాయలు, పచ్చి మర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పు, పులావ్ దినుసులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు, కొత్తి మీర, కరివేపాకు, ఆయిల్.
మీల్ మేకర్ మసాలా రెసిపీ తయారీ విధానం:
ముందుగా మీల్ మేకర్స్‌ని వేడి నీటిలో వేసి పది నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నీటిని పిండేసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఫ్రైడ్ ఆనియన్స్, నానబెట్టిన జీడి పప్పు, బాదం పప్పు, టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్టులా మిక్సీ పట్టాలి. తర్వాత కడాయిలో ఆయిల్ లేదా బటర్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. మీల్ మేకర్‌లను వేసి వేయించాలి. వీటిని మళ్లీ ప్లేట్ లోకి తీసుకుని.. పులావ్ దినసులు వేసి దోరగా ఫ్రై చేయాలి.
ఆ తర్వాత అదే నూనెలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగాక.. మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి కలపాలి. ఇవి ఓ రెండు నిమిషాలు వేయించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట వేసి కలపాలి. ఇది కాసేపు వేగాక.. నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఓ ఐదు నిమిషాల పాటు ఉడికాక.. పెరుగు వేసి కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి.. చిక్కపడి ఆయిల్ పైకి తేలేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా, కరివేపాకు, కొత్తి మీర వేసి బాగా కలిపి.. ఓ ఉడుకు ఉడకనించ్చి దగ్గర పడ్డాక దింపేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మసాలా సిద్ధం.