Kothimeera Pickle: కొత్తిమీరతో ఇలా ఆవకాయ పెట్టండి.. వేడి అన్నంతో తింటే ఆహా!
కొత్తిమీరతో రోటి పచ్చళ్లు కూడా చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. కొత్తిమీర తినడం వల్ల రక్తం కూడా శుభ్ర పడుతుంది. కొత్తిమీరతో నిల్వ పచ్చడి కూడా చేయవచ్చు. అదే కొత్తిమీర ఆవకాయ. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా కొత్తిమీర ఆవకాయ వేసుకుని తింటే ఆహా.. మాటలు ఉండవు. ఇక తింటూనే ఉంటారు..
కొత్తిమీర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కొత్తిమీర తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఆరోగ్యానికి కొత్తిమీర చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే కొత్తిమీరను కూడా ఆహారంలో చేర్చారు. ఎలాంటి రెసిపీ అయినా కొత్తిమీర వేస్తే చివరిలో వచ్చే ఆ రుచే వేరు. కొత్తిమీరతో రోటి పచ్చళ్లు కూడా చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. కొత్తిమీర తినడం వల్ల రక్తం కూడా శుభ్ర పడుతుంది. కొత్తిమీరతో నిల్వ పచ్చడి కూడా చేయవచ్చు. అదే కొత్తిమీర ఆవకాయ. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా కొత్తిమీర ఆవకాయ వేసుకుని తింటే ఆహా.. మాటలు ఉండవు. ఇక తింటూనే ఉంటారు. కేవలం అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీలు, ఉప్మాలో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ కొత్తిమీర ఆవకాయ ఎలా చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొత్తిమీర ఆవకాయకి కావాల్సిన పదార్థాలు:
కొత్తిమీర, చింత పండు, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, ఆవాలు, మెంతులు, పచ్చి శనగపప్పు, వెల్లుల్లి, మినపప్పు, కరివేపాకు, ఎండు మిర్చి, జీలకర్ర.
కొత్తిమీర ఆవకాయ తయారీ విధానం:
ముందుగా కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి తడి క్లాత్ మీద ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టకవచ్చు. వేడి నీళ్లతో కూడా కొత్తిమీర శుభ్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా వేడినీళ్లు వేసి నానబెట్టిన చింత పండును పిసికి గుజ్జు తీసుకుని పక్కన పెట్టండి. కొత్తిమీర నీళ్లు లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత.. ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో కొత్తిమీర వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. కొత్తిమీర బాగా వేగిపోయాక తీసి ఓ ప్లేట్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి చింత పండు గుజ్జు తీసి ఉడికించుకోండి. ఇందులో కొద్దిగా కూడా వేసి ఉడికించాలి. చింత పండు దగ్గర పడ్డాక దీసి పక్కన పెట్టండి.
ఇప్పుడు మరో కడాయి తీసుకుని అందులో మెంతు, ఆవాలు వేసి వేయించి చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి.. వెల్లుల్లి రెబ్బలు, పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి ఈ తాళింపు పక్కన పెట్టాలి. ఇప్పుడు మెంతి, ఆవ పొడిని కారాన్ని.. కొత్తిమీరలో వేసి కలపండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను చింత పండులో వేసి మొత్తం ఓ ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర మిశ్రమం చల్లారాక తాళింపు వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి సిద్ధం.