Chicken Liver Fry: టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై.. సువాసనతో కడుపు నిండిపోతుంది..

చికెన్ లివర్ తినడం కూడా చాలా ఆరోగ్యం. ఇందులో కూడా శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే చికెన్ లివర్ ఎంత బాగా వండినా నీచు వాసన వస్తుంది. అలా కాకుండా మరింత రుచిగా ఉండేలా ఇప్పుడు మీ కోసం చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఓ 15 నిమిషాల్లోనే మీకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై సిద్ధం. నీచు వాసన రాకుండా ఉంటుంది. బిర్యానీ, రైస్, చపాతీల్లోకి..

Chicken Liver Fry: టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై.. సువాసనతో కడుపు నిండిపోతుంది..
Chicken Liver Fry
Follow us

|

Updated on: Oct 13, 2024 | 7:50 PM

చికెన్ లివర్ తినడం కూడా చాలా ఆరోగ్యం. ఇందులో కూడా శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే చికెన్ లివర్ ఎంత బాగా వండినా నీచు వాసన వస్తుంది. అలా కాకుండా మరింత రుచిగా ఉండేలా ఇప్పుడు మీ కోసం చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఓ 15 నిమిషాల్లోనే మీకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై సిద్ధం. నీచు వాసన రాకుండా ఉంటుంది. బిర్యానీ, రైస్, చపాతీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట రాని వాళ్లు సైతం ఈ ఫ్రై చేయవచ్చు. మరి ఈ చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ లివర్‌ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు, ఆయిల్.

చికెన్ లివర్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చికెన్ లివర్‌ని రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత.. కొద్దిగా పసుపు, పెరుగు వేసి బాగా తిప్పి ఆ తర్వాత నీళ్లు వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ లివర్‌ నుంచి వాటర్ మొత్తం తీసేసి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పెరుగు వేసి సమయం ఉంటే రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టినా మంచిదే.

ఇవి కూడా చదవండి

సమయం లేని వాళ్లు ఓ గంట పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేసుకోవాలి. ఇందులోనే నేరుగా మ్యారినేట్ చేసిన చికెన్ లివర్ మిశ్రమాన్ని వేయాలి. ఇలా దగ్గర ఉండి ఓ పావుగంట సేపు వేయిస్తే చాలు. చివరగా కొత్తిమీర చల్లాలి. అంతే ఎంతో రుచిగా ఉండే.. చికెన్ లివర్ ఫ్రై సిద్ధం.