Chicken Kebabs: రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కబాబ్స్.. ఇంట్లోనే ఈజీగా చేసేయవచ్చు..

కొన్ని కొన్ని రకాల వంటకాలు కేవలం రెస్టారెంట్లలోనే తయారు చేయడానికి వీలు ఉంటుంది. ఇలా వీటిల్లో కబాబ్స్ కూడా ఒకటి. కానీ ఎప్పుడై రెస్టారెంట్లకి వెళ్లి తినాలంటే వీలు ఉండదు. పైగా రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి కబాబ్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాస్త సమయం పట్టినా.. ఇప్పుడు చెప్పినట్టు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. సండే సమయంలో, స్పెషల్ డేస్‌లో చేసుకుని తింటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా చాలా మంది ఎక్కువగా తినే వాటిల్లో చికెన్ కబాబ్స్..

Chicken Kebabs: రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కబాబ్స్.. ఇంట్లోనే ఈజీగా చేసేయవచ్చు..
Chicken Kebabs
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2024 | 8:31 PM

కొన్ని కొన్ని రకాల వంటకాలు కేవలం రెస్టారెంట్లలోనే తయారు చేయడానికి వీలు ఉంటుంది. ఇలా వీటిల్లో కబాబ్స్ కూడా ఒకటి. కానీ ఎప్పుడై రెస్టారెంట్లకి వెళ్లి తినాలంటే వీలు ఉండదు. పైగా రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి కబాబ్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాస్త సమయం పట్టినా.. ఇప్పుడు చెప్పినట్టు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. సండే సమయంలో, స్పెషల్ డేస్‌లో చేసుకుని తింటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా చాలా మంది ఎక్కువగా తినే వాటిల్లో చికెన్ కబాబ్స్ కూడా ఒకటి. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు చాలా మంది వీటిని ఆర్డర్ చేస్తూ ఉంటారు. మరి ఈ చికెన్ కబాబ్స్‌ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ కబాబ్స్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, పచ్చి మిర్చి, చాట్ మసాలా, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, గుడ్డు, బటర్, జీలకర్ర పొడి, కబాబ్స్ స్టిక్స్.

చికెన్ కబాబ్స్‌ తయారీ విధానం:

ముందుగా కబాబ్స్ స్టిక్స్‌ని ఓ అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో చికెన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, పచ్చి మిర్చి, చాట్ మసాలా, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, గుడ్డు, జీలకర్ర పొడి, కొద్దిగా ఆయిల్ వేసి అన్నీ కలపండి. ఇవన్నీ కలిపాక ఆ తర్వాత కోడి గుడ్డు వైట్‌ని కూడా వేసి మిక్స్ చేయండి. కోడి గుడ్డు నచ్చని వారు శనగ పిండిని కలుపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మ్యారినేట్ చేసి ఓ గంట పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఈ మిశ్రమంతో ముద్దలు వేస్తూ తడి చేసుకుని కబాబ్స్ స్టిక్స్‌కి అతికించాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట సేపు.. చిన్న మంట మీద ఫ్రై చేయాలి. చుట్టు తిప్పుతూ ఉండాలి. అంతే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచిగా రుచిగా ఉండే చికెన్ కబాబ్స్ సిద్ధం. ఇవి టమాటా సాస్, మయోనీస్, గ్రీన్ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్