AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Bread Toast: ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఇలా చేయండి.. ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు!

బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి దోశలు, ఇడ్లీలు, ఉప్మా. ఎప్పుడూ అవే తిని బోర్ కొడుతూ ఉంటాయి. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. వెరైటీగా, టేస్టీగా కావాలి అని అంటారు. ఇప్పటికే బ్రేక్‌ ఫాస్ట్‌లో ఎన్నో వెరైటీ రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. అదే ఎగ్ బ్రెడ్ టోస్ట్. కొంత మందికి ఈ రెసిపీ తెలుసు. కానీ ఇది తయారు చేసే విధానం మాత్రం కాస్త కొత్తగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు ఇది ఖచ్చితంగా..

Egg Bread Toast: ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఇలా చేయండి.. ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు!
Egg Bread Toast
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 12, 2024 | 8:07 PM

Share

బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి దోశలు, ఇడ్లీలు, ఉప్మా. ఎప్పుడూ అవే తిని బోర్ కొడుతూ ఉంటాయి. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. వెరైటీగా, టేస్టీగా కావాలి అని అంటారు. ఇప్పటికే బ్రేక్‌ ఫాస్ట్‌లో ఎన్నో వెరైటీ రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. అదే ఎగ్ బ్రెడ్ టోస్ట్. కొంత మందికి ఈ రెసిపీ తెలుసు. కానీ ఇది తయారు చేసే విధానం మాత్రం కాస్త కొత్తగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు ఇది ఖచ్చితంగా నచ్చడం ఖాయం. పదే పది నిమిషాల్లో రెసిపీ కూడా తయారైపోతుంది. మరి ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ బ్రెడ్ టోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:

ఎగ్స్, బ్రెడ్, బటర్ లేదా ఆయిల్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, ఉప్పు, టమాటాలు, కొత్తి మీర, మిరియాల పొడి.

ఎగ్ బ్రెడ్ టోస్ట్‌ రెసిపీ తయారీ విధానం:

ముందు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో గుడ్లను పగటకొట్టి వేయాలి. ఇప్పుడు ఎగ్స్‌ని బాగా బీట్ చేసి.. అందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మర్చి, కొత్తి మీర తరుగు, కారం వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. బటర్ లేదా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఎగ్ మిశ్రమంలో ఓ నిమిషం పాటు ఉంచి.. తీసి పెనం మీద ఉంచాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత దీన్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ సిద్ధం. బ్రెడ్ మైదాతో చేసింది కాకుండా.. బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీ విటమిన్ బ్రెడ్ తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ఈ రెసిపీ తయారు చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది.

Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?