Chicken Fingers: స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో చేసే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా స్నాక్స్ అయితే వేరే లెవల్ టేస్టీగా ఉంటాయని చెప్పొచ్చు. చికెన్‌తో చాలా రకాల స్నాక్స్, పచ్చళ్లు, వేపుళ్లు, కూరలు ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఏం చేసినా చాలా బాగుంటాయి. అయితే చాలా ఐటెమ్స్ ఇంట్లో తయారు చేయలేం. దీంతో రెస్టారెంట్‌లకు వెళ్లి తింటూ ఉంటారు. ఇలా రెస్టారెంట్‌లో తినే ఐటెమ్‌లో చికెన్ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా..

Chicken Fingers: స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
Chicken Fingers
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 07, 2024 | 11:15 PM

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో చేసే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా స్నాక్స్ అయితే వేరే లెవల్ టేస్టీగా ఉంటాయని చెప్పొచ్చు. చికెన్‌తో చాలా రకాల స్నాక్స్, పచ్చళ్లు, వేపుళ్లు, కూరలు ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఏం చేసినా చాలా బాగుంటాయి. అయితే చాలా ఐటెమ్స్ ఇంట్లో తయారు చేయలేం. దీంతో రెస్టారెంట్‌లకు వెళ్లి తింటూ ఉంటారు. ఇలా రెస్టారెంట్‌లో తినే ఐటెమ్‌లో చికెన్ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలి పెట్ట బుద్ధి కాదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం. కాబట్టి వేడి వేడిగా, స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది. అన్నీ సిద్ధంగా ఉంటే కేవలం 20 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది. మరి చికెన్ ఫింగర్స్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ ఫింగర్స్‌కి కావాల్సిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్, ఎగ్స్, బ్రెడ్, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాల పొడి, ఎండు మిర్చి, నిమ్మరసం, ఆయిల్.

చికెన్ ఫింగర్స్‌ తయారీ విధానం:

ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముక్కల్ని సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఇప్పుడు కనీసం అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ పొడి కూడా వేసి ఒకసారి కలపండి. ఉల్లిపాయ పొడి లేకపోతే.. ఉల్లిపాయల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. నెక్ట్స్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని తీసుకుని బ్రెడ్‌లో రూల్ చేయాలి. ఆ తర్వాత కోడి గుడ్డు మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసి వేడి చేసుకోవాలి. అన్ని వైపులాగా మీడియం మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి రాగానే తీసేసి.. టిష్యూ పేపర్‌లో వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫింగర్స్ సిద్ధం. దీన్ని మయోనీస్ లేదా టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు