AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalakaya Kura: తలకాయ కూర ఇలా ఒక్కసారి వండారంటే.. అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు!

నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాల్లో తలకాయ కూర కూడా ఒకటి. తలకాయ కూర అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది. నోట్లోకి అలా ముక్క పెట్టగానే కరిగిపోతుంది. ఈ కర్రీని పులావ్, అన్నం, చపాతీ, రోటీ దేనితో అయినా తినొచ్చు. అయితే చాలా మందికి తలకాయ కూర చేయడం అస్సలు రాదు. కానీ ఒక్కసారి ఈ పద్దతిలో వండారంటే.. తిన్న వాళ్లందరూ మీకు ఫ్యాన్స్..

Thalakaya Kura: తలకాయ కూర ఇలా ఒక్కసారి వండారంటే.. అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు!
Thalakaya Kura
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 23, 2024 | 10:45 PM

Share

నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాల్లో తలకాయ కూర కూడా ఒకటి. తలకాయ కూర అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది. నోట్లోకి అలా ముక్క పెట్టగానే కరిగిపోతుంది. ఈ కర్రీని పులావ్, అన్నం, చపాతీ, రోటీ దేనితో అయినా తినొచ్చు. అయితే చాలా మందికి తలకాయ కూర చేయడం అస్సలు రాదు. కానీ ఒక్కసారి ఈ పద్దతిలో వండారంటే.. తిన్న వాళ్లందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అంత రుచిగా వస్తుంది. మరింకెందుకు లేట్ ఈ తలకాయ కూర ఎలా చేస్తారు? ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలు:

తలకాయ కూర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తి మీర, చింత పండు పులుసు, బిర్యానీ దినుసులు, ఆయిల్.

తలకాయ కూర తయారీ విధానం:

ముందుగా తలకాయ కూరను శుభ్రంగా చేసుకుని దాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఓ అరగంటైనా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ సమయం అయినా పర్వాలేదు. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముందుగా బిర్యానీ దినుసులు వేసి వేయించుకోవాలి. నెక్ట్స్ ఉల్లి పాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలర్ మారేంత వరకూ ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. నెక్ట్స్ టమాటా ముక్కలు వేసి, మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న తలకాయ కూర వేసి ఓ పది నిమిషాల పాటు బాగా వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాలు వేయించి.. సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఓ ఆరు విజిల్స్ వచ్చాక కట్టేయాలి. ఇప్పుడు కూర సగం ఉడికి ఉంటుంది. ఈ టైమ్‌లో చింత పండు పులుసు కొద్దిగా వేసి.. మళ్లీ మీడియం మంటపై ఓ పది నిమిషాలు ఉడికించాలి. కర్రీ దగ్గర పడుతున్న సమయంలో అన్నీ ఒకసారి రుచి చూసుకుని.. కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ తలకాయ కూర సిద్ధం.

Follow Us
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు